ప్రపంచాన్ని కరోనా  వణికిస్తోంది. ఎన్నో ప్రభుత్వాలు కరోనా  కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వానికి మద్దతుగా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా స్పందిస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం కార్పొరేట్ ఆస్పత్రుల దాహానికి కరోనా పేషెంట్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

 

కార్పొరేట్, ప్రయివేటు  పేరు ఏదైనా కావచ్చు కానీ  అందినకాడికి దోచుకోవడం అనే పరిస్థితికి చేరింది తెలంగాణలో. ఏ చిన్న రోగం వచ్చినా సరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే చాలు లక్షల రూపాయలు వసూలు చేసే పరిస్థితి నెలకొంది. మానవ విలువలు మంటగలిపి, పేషెంట్లను అడ్డం పెట్టుకొని కావాల్సినంత సొమ్ము చేసుకుంటున్నాయి కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు.

 

కార్పొరేట్ ఆసుపత్రులు మామూలు రోజుల్లోనే ఓ పేషెంట్ వస్తే చాలు, అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు, ట్రీట్ మెంట్, మందులు, స్పెషల్ వార్డులు, స్పెషల్ కేర్, అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తాయి. అయితే  అందరూ అనుకుంటున్న డేంజర్ కరోనా తో కూడా కాసులు వసూలు చేసే పన్నాగాలు మొదలుపెట్టాయి ఆస్పత్రులు... ఫ్లూ  లక్షణాలతో ఆస్పత్రికి వస్తే చాలు, కరోనాకు టెస్ట్ అంటూ నానా హడావిడి చేస్తున్నాయి. కరోనా నెగిటివ్ వస్తే వేలల్లో, పాజిటివ్ వస్తే లక్షల్లో... ఇలా ప్లాన్ చేసుకుని మరీ వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు.

 

కరోనా విషయంలో ప్రైవేట్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది.. ట్రీట్ మెంట్ కు అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు టెస్టుల విషయంలో మాత్రం ప్రైవేట్ కు అనుమతి ఇవ్వలేదు.  జలుబు లక్షణాల తో కాస్త కరోనా అనుమానంతో ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెడితే చాలు... వెంటనే స్పెషల్ రూమ్ కి తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయాలంటూ ఒత్తిడి తెస్తారు. స్వాబ్  తీసి టెస్టింగ్ కు పంపిస్తారు. రిపోర్ట్  రావడానికి టైం పడుతుంది... ఈ లోపు  ఐసోలేషన్ వార్డులో ఉండాలంటూ పేషంట్ ను తరలించేస్తారు. 

 

ఇప్పటికే హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వందల మందికి కరోనా ట్రీట్ మెంట్ జరుగుతోంది. అనుమానం తో వచ్చిన వాళ్లను ..  రిపోర్టు వచ్చే వరకు స్పెషల్ వార్డుల్లో ఉంచి ట్రీట్ మెంట్  చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఏకంగా ఒక్కో పేషెంట్ నుంచి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు బిల్ వసూలు చేస్తున్నారు.

 

వాస్తవానికి కరానాకు ట్రీట్ మెంట్  లేదు.. కేవలం సింప్టమాటిక్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.. ఇప్పటికీ కరోనా వచ్చిన వాళ్లలో ఎంతోమంది ,ఎటువంటి చికిత్స లేకుండానే రికవరీ అవుతున్నారు ...అంతే కాదు అంతేకాదు కొత్తగా ఐసీఎంఆర్ ఇచ్చిన నిబంధనల మేరకు ఏకంగా కరోనా వచ్చిన వాళ్లకు ఇళ్లలోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు... అయితే ఐసీఎంఆర్ నిబంధనలు ,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు ...  కాసుల వేటలో కరోనాను వాడుకుంటున్నాయి.

 

అవసరం ఉన్నా లేకున్నా, కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా టెస్టులు చేస్తున్నాయి. ఫలితాలు వచ్చేవరకు ఐసీయూలో ఉంచి బిల్లులు వేస్తున్నాయి ..డాక్టర్లకు పేషెంట్లకు పిపిఇ కిట్లు అంటూ స్పెషల్ బిల్ వేస్తున్నాయి.. మరోపక్క కరోనా వస్తే డేంజర్ అంటూ మరికొన్ని టెస్టులు చేస్తూ ఆస్పత్రులు దోచుకుంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: