జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు బహిరంగ వేదికలో సినిమా ఆడియో వేడుకలలో నేను ఈ స్థాయికి రావడానికి ఒకే ఒక కారణం అన్నయ్య చిరంజీవి. పవన్ కళ్యాణ్ తన సినిమాల సక్సెస్ గురించి మాట్లాడే ప్రతి సారి అభిమానుల ముందు.... 'ఈ విధంగా నేను నిలబడి గలిగాను' అంటే దానికి మా అన్నయ్య వేసిన ప్లాట్ ఫామ్ ఆయన పడ్డ కష్టమే కారణమని చెబుతుంటారు. చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని అభిమానులు పవర్ స్టార్ గా గుర్తించి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వరుస విజయాలతో తనకంటూ సెపరేట్ క్రేజ్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాల పరంగా గానీ ఇటు రాజకీయపరంగా గాని రాణిస్తున్నాడు అంటే దానికి మూల కారణం చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో జనసేన పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి తీవ్రంగా కృషి చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలతో చిరంజీవి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో బాలకృష్ణ చిరంజీవి పై మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ పై దారుణమైన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సందర్భంలో ఇటీవల దాసరి స్థానాన్ని కొంతమంది రిప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చిరంజీవిపై బాలయ్య పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.

 

ఇలాంటి సమయంలో మెగాభిమానులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. "నా తమ్ముడికి లైఫ్ ఇచ్చాను అలాంటి నా తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు నాపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నవారు, 2014 ఎన్నికల్లో నా తమ్ముడు పవన్ లేకపోతే మీ పార్టీ గెలిచేదా అని…" ఈ విధంగా చిరంజీవి  రిప్లై ఇస్తే బాలకృష్ణ గాని మరి కొంతమంది గాని తల ఎత్తుకోగలరా అని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి పై వ్యాఖ్యలు చేస్తున్న వారు సమాధానం ఇవ్వగలరా..? అని అడుగుతున్నారు. చిరంజీవి తన వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ ఏ ప్రభుత్వం దగ్గర సమావేశం కాలేదని ఇండస్ట్రీ బాగు కోసం, షూటింగ్ల పర్మిషన్ కోసం వెళ్తే అంత కడుపుమంట ఏంటి అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: