వైసీపీ బలమైన పార్టీ. 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకున్న పార్టీ. చరిత్రలో కనీ వినీ ఎరగని విజయాన్ని దక్కించుకున్న పార్టీ. జగన్ అజేయుడిగా కనిపిస్తున్నారు. ఇంకా గెలుపు తాలూకా జయజయద్వానాలు చెవులలో మారుమోగుతూనే ఉన్నాయి. అటువంటి టీడీపీలో చీలిక సాధ్యమా.

 

అంటే రాజకీయాల్లో ఏదినా సాధ్యమేనన్న మాట ఉంది. ఇక ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అసంత్రుప్తిగా ఉన్నారు. వారంతా కూడా తన బాధను ఏదో ఒకలా  వ్యక్తం చేస్తున్నారు. చేతులు కట్టేసినట్లుగా ఉందన్న వారూ పార్టీలో ఉన్నారు. అయితే  వారి అసంత్రుప్తి అంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదేనని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.

 

దానికి కారణం వారికి జగన్ తో పెద్దగా పేచీ పూచీలు లేవు. స్థానికంగా ఉన్న గొడవలు, నాయకుల మధ్యన ఉన్న విభేదాల కారణంగా వారు తన మంటను దాచుకోలేకపోతున్నారు. అయితే అలాగని దాన్ని తేలికగా చేయాలని చూస్తే మాత్రం ప్రమాదమేనని కూడా చరిత్ర చెబుతోంది.

 

ఏ అసమ్మతి ఎటు దారితీస్తుందో కూడా ఎవరికి తెలుసు అంటున్నారు. ఇదిలా ఉండగా అపుడెపుడో విపక్ష నేతగా ఉన్న  జగన్ తనకు టచ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారనగానే ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాగేసి ఫిరాయింపులకు బాహాటంగా తెరతీశారు. ఇపుడు టీడీపీ నాయకుల మదిలో ఇలా రివర్స్ ఫిరాయింపుల పర్వానికి తెరతీయాలన్న ఆలోచనలు కనుక వస్తే మాత్రం టీడీపీని వైసీపీ చూస్తూ ఊరుకోదు. చీల్చి చెండాడుతుంది.

 

 అపుడు మిగిలేది పార్టీలో బాబు, ఆయన గారి బావమరిది బాలక్రిష్ణ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని వైసీపీ నేతలు  అంటున్నారు. మరి చూడాలి అవతల పక్కన ఉన్నది చంద్రబాబు. అనేక రాజకీయ  యుధ్ధాలలో ఆరితేరిన వాడు. ఇక ఈమధ్యనే బాలయ్య ఈ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదంటూ హింట్లు ఇచ్చారు. దాంతో ఇపుడు వైసీపీలో కొంత అలజడి మొదలవుతోంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: