మంచి  చేసే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ  చెడు మాత్రం చేయకూడదు అని ఒక నానుడి ఉంది, ప్రస్తుతం సోనుసూద్ విషయంలో ఉద్దవ్ థాక్రే  సరిగ్గా ఇలాంటిదే చేస్తున్నట్లు తెలుస్తోంది. సోను సూద్ వలస కార్మికుల విషయంలో ఎవ్వరూ చేయలేనంత గొప్ప పని చేస్తున్న విషయం తెలిసిందే. తనలోని మానవత్వాన్ని చాటుకుంటు వలస కార్మికుల కష్టాలను తీరుస్తూ అడుగడుగున నేనున్నాను అంటూ భరోసా  ఇస్తున్నారు. వలస కార్మికుల తరలింపు విషయంలో సోను సూద్ చేస్తున్న సహాయం చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పాలి. బస్సులు రైళ్లు  ద్వారా సోనుసూద్ వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు తరలించేందుకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. 

 


 అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో  బిజెపి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి కానీ సమన్వయంగా ముందుకు సాగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ప్రతి విషయంలో ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు శివసేన అధినేత ఉద్ధవ్ ని  అసమర్ధుడు గా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఉద్ధవ్ థాక్రే కారణంగానే ప్రస్తుతం కరోనా  వైరస్ పెరిగిపోయింది అనే విధంగా పూర్తిగా ఆరోపణలు చేస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. 

 

 అయితే మొన్నటికి మొన్న సోనుసూద్ చేస్తున్న సహాయంపై శివసేన నేత అయిన సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేస్తూ సోనుసూద్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం సోను సూద్ ఆయనే స్వయంగా వలస కార్మికుల ను బస్సులు రైళ్లు  దగ్గరికి తీసుకెళ్లి పిల్లలు ఎక్కించి స్వస్థలాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రామిక్  రైల్లోకి రాకుండా సోనూసూద్ ని అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇది మాకు సంబంధం లేదు రైల్వేశాఖకు సంబంధించింది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా వలస కార్మికులకు సహాయం చేస్తూ తన పెద్ద మనసు చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి ఎక్కడ పేరు వస్తుందోనని  అపకారం చేయడానికి కూడా వెనుకాడడం లేదు అని మండిపడుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: