రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని తెలిపారు మంత్రి కేటీఆర్‌. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు  కాంగ్రెస్ నేతలకు గుర్తుకు రాని రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని విమర్శించారు.

 

రంగనాయకసాగర్‌ నుంచి సిరిసిల్ల నియోజక వర్గం ముస్తాబాద్‌ మండలానికి గోదావరి జిలాలు చేరుకున్న సందర్భంగా బదనకల్‌ చెరువు వద్ద గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్‌ హారతి ఇచ్చారు.

 

గోదావరి జలాలు సిరిసిల్ల నియోజకవర్గంలో మెట్టప్రాంతమైన బదనకల్ రావడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. యాభై ఏళ్లలో ఎన్నడు చూడని అద్భుత దృశ్యం చూస్తున్నామని చెప్పారు.

 

దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు కేటీఆర్. చెరువులు,కుంటలు నీళ్ళతో నిండి మత్తడి దూకుతుంటే కాంగ్రెస్ నేతలకు కళ్ళు మండుతున్నాయని చెప్పారు. 

 

రైతు బంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని ఏ ఒక్క పథకాన్ని ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

 

వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తెచ్చామని దీనివల్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని చెప్పారు కేటీఆర్. గతంలో రైతు బంధు వచ్చిన వారందరికీ మళ్లీ చెక్కులు ఇస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. 

 

గ్రామాల్లో రైతు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు కేటీఆర్. ఈ నెల 13వ తేదీన కాంగ్రెస్ నేతలు  జలదీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు.  కుందేళ్లను చంపి తిన్న నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్లు ఉందని విమర్శించారు కేటీఆర్.

 

తెలంగాణలో చెరువులు నిండి.. పొలాలు పండుతుంటే.. కాంగ్రెసోళ్ల కడుపులు మండుతున్నాయని కేటీఆర్ సెటైర్లు వేశారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: