బర్త్ డే బాయ్ నందమూరి బాలయ్య నిన్న తన 60వ జన్మదిన వేడుకల సందర్భంగా చాలా బిజీగా గడిపారు. బంధువులు, సన్నిహితులు మధ్య తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగానే చేసుకున్నారు. ఒకవైపు పుట్టినరజును చేసుకుంటూనే, మరోవైపు తెలుగు చిత్రసీమ లో జరుగుతున్న తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే పనిలో బాలయ్య నిమగ్నం అయ్యారట. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను,  మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని కొంతమంది సినీ ప్రముఖుల బృందం వెళ్లి కలవడం, చిత్ర పరిశ్రమ సంబంధించిన అనేక విషయాలపై చర్చించడం జరిగింది. కాకపోతే ఆ సమావేశానికి తనను పిలవకపోవడంపై ఆయన ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయంపై మాట్లాడేందుకు మళ్లీ అదే చిరంజీవి బృందం సిద్ధమైంది.

IHG


 ఈ సమావేశానికి రావాల్సిందిగా బాలయ్యనూ ఆహ్వానించారు. తన పుట్టినరోజు కారణంగా రాలేకపోతున్నానని బాలయ్య కూడా బాలయ్య వారికి కబురు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ఆధ్వర్యంలోని కొంతమంది సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ను కలిసి అనేక విషయాలపై చర్చించారు. అయితే వారు జగన్ తో ఏ ఏ విషయాలపై క్షుణ్ణంగా చర్చించారు..?  జగన్ దానికి ఏ విధంగా స్పందించాడు వంటి అనేక అంశాల గురించి బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన సురేష్ బాబు, సి.కళ్యాణ్ లను ఈ విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. తనకు ఆ సమావేశానికి రావాలని ఉన్నా, పుట్టినరోజు కారణంగా రాలేకపోయానని, ఈ సందర్భంగా బాలయ్య వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

IHG


అలాగే విశాఖ లో షూటింగ్ చేసుకునేందుకు బాలయ్య ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అలాగే నంది పురస్కారాలు విషయంపై చిరంజీవి జగన్ తో చర్చించిన విషయం పైన బాలయ్య ఎక్కువ ఆరా తీసారట.  జగన్ తో బాలయ్య భేటీకి వెళ్లకపోయినా, అక్కడ పరిస్థితులపై ఆరా తీయడం, టాలీవుడ్, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: