తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వందల  సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. అంతకంతకు పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు.  

 

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా 191  కేసులు నమోదు కాగా..8 మంది మృతి చెందారు.  దీంతో మొత్తం మరణాలు156కు చేరాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143 కేసులు ఉన్నాయి. మేడ్చల్ లో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8 కేసులు నమోదు కాగా., మహబూబ్‌నగర్ 4, జగిత్యాల 3, మెదక్ 3, నాగర్‌కర్నూలు 2 కరీంనగర్‌లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2వేల 138 యాక్టివ్ కేసులుండగా..2 వేల 138 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య  4 వేల 111కు చేరింది. ఇటు ఏపీలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 218 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 5 వేల 247కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 78 మంది మృతి చెందారు. 

 

రాష్ట్రానికి చెందిన 136 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 26 మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 56 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5 వేల 247కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఏపీలోని పలు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 1573 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాను జయించి 2 వేల 475 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందగా.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 78కి చేరింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 15 వేల 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 72 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్‌ వల్ల మంగళవారం తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మొత్తం 2 వేల 475 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం వెయ్యి 573 మంది కరోనా బాధితులు వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: