అన్నీ దొరుకుతున్నాయి ప్రకృతిలో కదా అని ఏది పడితే అది తినకూడదు. కొన్ని తినేవి ఉంటాయి మరికొన్ని తినకూడనవి ఉంటాయి. అలాంటి వాటి విషయంలో ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఈ విషయంలో కొన్ని దేశాలు చాలా కచ్చితంగా వ్యవహరిస్తాయి. మరికొన్ని దేశాల్లో ఏది పడితే అది తినటం వల్ల ప్రపంచానికి హానికరంగా పక్కలో బల్లెం లాగ తయారవుతాయి. ఇప్పుడు ఇదే విధంగా చైనా ప్రపంచ దేశాలకు పక్కలో బల్లెం లాగా మారింది. వాస్తవానికి అయితే ప్రపంచ దేశాలలో ప్రమాదకరంగా వచ్చే వైరస్ గాని వ్యాధులు గాని ఎక్కువగా ఆఫ్రికా దేశాలనుండి వస్తుంటాయి. హెచ్ఐవి మరియు ఎబోలా ఇలాంటివన్నీ ఆఫ్రికా దేశంలోనే పుట్టుకొచ్చాయి. ఎందుకంటే వారు ఏది పడితే అది తింటారు, అదేవిధంగా శుభ్రం ఉండదని చాలా మంది అంటుంటారు.

 

కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టింది చైనా దేశంలో. వారు తినే ఆహారాలు గాని ఆహారపు అలవాట్లు గానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయని అందరికీ తెలుసు. పాములను, గొంగళి పురుగులను మనవాళ్లు చెకోడీలు తిన్నట్లు వాళ్ళు తింటుంటారు. ఆ విధంగానే చైనా దేశంలో ఒక వ్యక్తి గబ్బిలం తినటం వల్ల కరోనా వైరస్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల దక్షిణ చైనాలో గ్యాంగ్ డాన్ ప్రాంతానికి చెందిన ఓ 30 సంవత్సరాల యువకుడు కడుపు నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో వైద్యులు అతడిని స్కాన్ చేస్తే మలద్వారంలో ఓ చేప ఇరుక్కుపోయి ఉంది. హాస్పిటల్ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. మామూలు పద్ధతిలో తీయాలని చూసినా కుదరలేదు. దీంతో వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేసి ఆ చేపను బయటకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

మామూలుగా తినటం వల్ల కడుపు లోకి వెళ్తోంది. మలద్వారం ద్వారా ఎలా వెళ్ళింది అన్నది వైద్యులకు అనుమానం వచ్చింది. ఆ విషయం గురించి బాధితుడిని అడిగితె, చెప్పిన సమాధానం విని వైద్యులు సైతం షాక్ అయ్యారు. అదేం పాడుపని అంటూ తిట్టిపోశారు. కాగా ఈ వార్త బయటకు సోషల్ మీడియాలో రావటంతో నెటిజన్లు ఈ చైనా వాళ్ళు ఈ జన్మకి మారరు. కరోనా వైరస్ వచ్చి పిచ్చెక్కి నట్టు ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మరో వైరస్ తీసుకొచేలా ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: