చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నీ చుట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు లక్షల మరణాలు సంబవించాయి.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మాయదారి మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనలేకపోతున్నారు. ఇక  ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ వేగం మరింతగా పెరిగింది.  ఈ క్రమంలో మొత్తం కరోనా కేసుల విషయంలో ఇండియా, బ్రిటన్ ను దాటేసింది. మొన్నటి వరకు పెద్దగా ఎఫెక్ట్ పడకున్నా..  అత్యధిక కేసులున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో 20 లక్షలకు పైగా కేసులతో అమెరికా ఉండగా, ఆ తరువాత  బ్రెజిల్ లో 7.72 లక్షల కేసులు, రష్యాలో 4.93 లక్షల కేసులు ఉన్నాయి. 

 

ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 2,95,772కు చేరింది. ప్రస్తుతం బ్రిటన్ లో ఇండియాకన్నా తక్కువగా 2,91,588 కేసులు ఉన్నాయి. మే 24 నుంచి భారతావనిలో కరోనా మహమ్మారి విజృంభణ శరవేగమైంది. ఇండియా టాప్-10 బాధిత దేశాల్లోకి చేరింది. ఫిబ్రవరిలో మన దేశంలోకి వచ్చింది కరోనా అప్పటి నుంచి కేసులు పెరుగుతూ రావడంతో మార్చి 24 న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ ను అమలు చేసిన ఇండియా, తొలుత వైరస్ ను చాలా వరకూ అడ్డుకుంటున్నట్టే కనిపించింది.

 

కానీ, మార్చి 25 తరువాత నిబంధనలను మరింతగా సడలించగా, ఆ సమయంలో రోజుకు సగటున 500 కేసులు, 10 మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది.  ఇప్పటివరకూ ఇండియాలో మరణాల సంఖ్య 8,500గా అధికారులు వెల్లడించారు. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,482 మంది మరణించారు.  దాదాపు లక్ష కేసులు జూన్ లోనే నమోదు కావడం గమనార్హం. అయితే ముంబాయిలో కరోనా కేసులు  చైనాను దాటి పోయాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: