దేశంలో కరోనాతో నానా యాత పడుతున్నారు జనాాలు.  ఇది చాలదన్నట్లు మహారాష్ట్ర, రాజస్థాన్ మరికొన్ని రాష్ట్రాల్లో మిడతల దాడులు మొదలయ్యాయి.  ఇక తుఫాన్ల సంగతి తెలిసిందే.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  దేశంలో కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయో.. అందులో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య ముంబాయిలో ఎక్కువగా ఉన్నాయి.  ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడ అయిన ధారావి ప్రాంతంలో కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఈ మద్య కొన్ని పల్లె ప్రాంతాల్లోకి కృర మృగాల దాడులు పెరిగిపోయాయి. 

 

 

దేశంలో పలు చోట్ల చిరుత, ఎలుగు బంట్ల స్వైర విహారం ఎక్కువైంది. తెలంగాణలో అయితే ఈ మద్య చిరుతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  గత నెల నుంచి తెలంగాణాలో వరుసగా చిరుతల దర్శనం అవుతూనే ఉన్నాయి. వాటిని వేటాడా పనిలో అటవీ శాఖ  నిమగ్నమైంది. మ‌హారాష్ట్ర‌లో దారుణం జ‌రిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు. విద‌ర్భ జిల్లాలోని అకోలా ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అకోలా ప‌ట్ట‌ణ స‌మీపంలోని నిమ్‌ఖేడీ  గ్రామానికి చెందిన అశోక్‌గావ్టే (52), మానా గావ్టే (42) లుగా గుర్తించిన‌ట్లు మెల్ఘాట్ టైగ‌ర్ రిజ‌ర్వ్ డీసీఎఫ్ (డిప్యూటీ క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్‌) తెలిపారు.

 

మెల్ఘాట్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లోని అకోట్ వైల్డ్‌లైఫ్ డివిజ‌న్ 357వ కంపార్ట్‌మెంట్ ద‌గ్గ‌ర‌ ఎలుగు దాడి జ‌రిగింద‌ని అట‌వీ అధికారులు తెలిపారు. అయితే మృత దేహాలకు సమీపంలో  6 నెల‌లు, 8 నెల‌ల వ‌య‌సున్న‌ రెండు ఎలుగు పిల్ల‌లు చనిపోయి ఉన్నాయి.  అయితే ఆ మృతులు వాటిని చంపి ఉంటారని.. తన పిల్లలను చంపి ఉంటారన్న కోపంతో  అది వారిపై దాడి చేసి ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామని వారు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: