ప్రపంచంలో దేనికి లొంగని వారు.. ఒక్క దేవుడికి.. దెయ్యానికి లొంగుతారని అంటారు.  మూఢ నమ్మకాలను వ్యతిరేకించే వారి విషయాన్ని పక్కన బెడితే మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దేవుడని భక్తి తో కొలవాలని నేర్పిన వారే.. బూచీ వస్తుందని దెయ్యం గురించి భయపెట్టారు.  ఇలా మనిషి దేవుడు అంటే ఎంత భక్తితో ఉంటాడో దెయ్యం అంటే అంతగా భయపడిపోతుంటారు. ఇదే కొంత మంది దొంగ బాబాలకు పెట్టుబడులుగా మారాయి.  ప్రపంచం ఎంత టెక్నాలజీతో ముందుకు సాగుతున్నా ఇప్పటికీ దొంగ బాబాలు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారు.  అయితే అందరూ కాకాకపోయినా.. కొంత మంది మాత్రం కామాంధులు గా మారి ఆడవారిపై అఘాయిత్యాలు చేసిన వారు ఉన్నారు.  ఇలా ఎంతో మంది బురిడీ బాబాలు తాము నమ్మిన భక్తులకు కుచ్చు టోపీ పెట్టి డబ్బులు దండుకున్నారు. 

 

ఇక బాబాలు ఒక్కో రంగాంగా ఉంటారని చెప్పుకుంటారు. తాజాగా ఓ బాబా తాను ముద్దు ఇస్తే రోగాలు నయం అవుతాయని ప్రచారం చేసుకున్నాడు.  అలా చేస్తూ చివరకు తానే రోగంతో బలి అయ్యాడు. అతనితో పాటు భక్తుల ప్రాణాలను కూడా ఇప్పుడు రిస్క్‌లో పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. అస్లాం బాబా అనే వ్యక్తి ముద్దుపెట్టి వ్యాదులను తొలగిస్తానని చెబుతూ చాలా కాలంగా ప్రాచుర్యం పొందాడు. 

 

అంతే ఆ చుట్టు పక్కల ప్రజలు గుడ్డిగా నమ్మారు... బాబా నిజంగా ముద్దు పెడితే తమ రోగాలు నయం అవుతాయని  ఆయన వద్దకు రావడం మొదలు పెట్టారు.  అలా వచ్చిన వారికి చేతులపై ముద్దులు పెట్టి పంపేవాడు. ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో దాన్ని కూడా నయం చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ మద్య  బాబా అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు చేయగా కరోనా వచ్చిందని తెలిసింది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆ బాబా చివరకు జూన్ 4న ప్రాణాలు కోల్పోయాడు.  ఆ బాబాను కలిసిన భక్తుల్లో 24 మందికి పాజిటివ్ అని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: