చంద్రబాబు ఆవేశంతో చేస్తున్న ప్రకటనలు కొన్ని అటు తిరిగి ఇటు తిరిగి ఆ పార్టీకే చుట్టుకుంటున్నాయి. ఏపీలో ఈఎస్ఐ స్కాం విషయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. అయితే దీని మీద బాబు నానా యాగీ చేస్తున్నారు. అలాగిలాగ కాదు, ఆయన ఏకంగా బాధ్యత గల దర్యాప్తు ఏజెన్సీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అనేశారు.

 

ఆ మీదట జగన్ని వైసీపీ సర్కార్ని నానా మాటలు అన్నారు. శాడిస్ట్ అంటూ దూషించారు. వైసీపీది కక్షపూరిత సర్కార్ అని కూడా అనేశారు. ఇవన్నీ ఇలా ఉంటే బాబు మీడియా సమావేశాంలో చెప్పిన కొన్ని మాటలు చూస్తూంటే ఈ ఎస్ఐలో స్కాం జరిగిందా అన్న అనుమానాలు కల‌గక మానవు.

 

తెలంగాణాలో ఈఎస్ఐ స్కాం జరిగితే అధికార్లనే అరెస్ట్ చేశారని, మంత్రికి కాదని వాదిస్తున్నారు. అదే ఏపీకి వచ్చేసరికి మాజీ మంత్రిని అరెస్ట్ చేయడమేంటని కూడా ఆయన వాదిస్తున్నారు. బాబు మాటలు వింటూంటే అధికారులనే బలి పెట్టమని అంటున్నట్లుగా ఉందని అంటున్నారు.

 

అంటే తన పార్టీ మనిషి కాబట్టి అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం బాబుకు ఇష్టం లేదు. అదే సమయంలో అధికారులు మాత్రం అరెస్ట్ కావాలా అన్న వాదన కూడా వస్తోంది. ఏది ఏమైనా అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారంటే సంబంధిత మంత్రుల అనుమతి లేకుండా ఉంటుందా అన్నది బాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కి తెలియదా అంటున్నారు.

 

అంటే బాబు విపక్షంలో ఉన్నా కూడా అధికారులదే తప్పు అనడం ద్వారా వారికి మరింత చెడ్డ అవుతూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా అచ్చెన్న సిఫార్స్ లెటర్ సొంత సంతకంతో ఉందని, ఇదే కాకుండా కీలకమైన ఆధారాలు ఉండబట్టే అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు అంటున్నారు. మొత్తానికి చూస్తే అచ్చెన్నను వెనకేసుకురాబోయి బాబు మరింత ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని పార్టీ నేతలు  అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: