ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ వేగం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో మొత్తం కరోనా కేసుల విషయంలో ఇండియా, బ్రిటన్ ను దాటేసింది. దేశంలో 9,996 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 357  మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 2,86,579కి చేరగా, మృతుల సంఖ్య 8,102కి చేరుకుంది. 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకున్నారు.తొలి స్థానంలో 20 లక్షలకు పైగా కేసులతో అమెరికా ఉండగా, ఆ తరువాత  బ్రెజిల్ లో 7.72 లక్షల కేసులు, రష్యాలో 4.93 లక్షల కేసులు ఉన్నాయి. మార్చి 25 తరువాత నిబంధనలను మరింతగా సడలించగా, ఆ సమయంలో రోజుకు సగటున 500 కేసులు, 10 మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. ఆ తరువాత పరిస్థితి మారిపోయింది.

 

ఇప్పటివరకూ ఇండియాలో మరణాల సంఖ్య 8,500గా అధికారులు వెల్లడించారు. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మాల్స్, రెస్టారెంట్లు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తెరచుకోవడంతో సమీప భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐదవ దశ లాక్‌డౌన్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ.. ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలకు ఇప్పటికీ అనుమతి లేదు. అందుకే స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు.

 

చివరకు పెళ్లిళ్లపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో హవేరిలో రామలింగేశ్వర స్వామి ఆలయం లాక్ డౌన్ నియమాలను అతిక్రమించి ఓ ఆలయ వార్షిక వేడుకలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎండ్ల బండ్ల పరుగులు ప్రత్యేకం. ఇటీవల పెద్ద ఎత్తున బోనా జాతర జరిపారు.. అక్కడ కూడా ఎవరూ మాస్క్, భౌతిక దూరం పాటించలేదు.  తాజాగా దీనికి  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎడ్ల బండి నిర్వహాకులపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: