అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత.. క్రికెట్ లోనూ జాతి వివక్ష ఉందని కలకలం రేగింది. తాను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్నప్పుడు తోటి ఆటగాళ్లు.. కాలా అంటూ గేలిచేశారని విండీస్ టీట్వంటీ కెప్టెన్ డారెన్ సామి ఆరోపించడం వివాదాస్పదమైంది. అయితే అలా అన్న ఆటగాళ్లతో మాట్లాడానని, వాళ్లు ప్రేమతోనే కాలా అని పిలిచినట్టు చెప్పారని, వారి మాటలు నమ్ముతున్నానని చెప్పి.. వివాదానికి తెరదించాడు సామి. 

 

ఐపీఎల్ సహచరులు కొంతమంది తనపై జాతి వివక్షత చూపించారని ఆరోపించాడు విండీస్ టీట్వంటీ కెప్టెన్ డారెన్ సామి. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ బలైన తరుణంలో.. సామి ఈ ఆరోపణలు చేయడంతో.. క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. అయితే ఐపీఎల్ లో తనను కామెంట్ చేసిన వారితో తాను మాట్లాడానని, వాళ్లు ప్రేమతోనే అలా అన్నారని సామి వివరణ ఇచ్చాడు. వారికి జాతివివక్ష ఫీలింగ్ లేదనే విషయాన్ని నమ్ముతున్నానని చెప్పాడు. 

 

అయితే అంతకుముందు సామి పెట్టిన ట్వీట్ కు తోటి విండీస్ ఆటగాళ్లు కూడా మద్దతిచ్చారు. తనను కాలా అని పిలిచినప్పుడు.. అది జాతి వివక్ష పదం అని కూడా తనకు తెలియదని సామి వాపోయాడు. దీంతో సామికి సపోర్ట్ గా విండీస్ ఆటగాళ్లు కూడా ట్వీట్ చేశారు. దీంతో ఐపీఎల్ వర్గాల్లో సామి కామెంట్ చర్చనీయాంశమైంది. అన్ని ఫ్రాంఛైజీల్లోనూ ఇదే చర్చ జరిగింది. చివరకు సామి వివాదానికి తెరదించడంతో.. అంతా సద్దుమణిగింది. 

 

విండీస్ కు రెండు సార్లు టీట్వంటీ వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా డారెన్ సామికి మంచి గుర్తింపు ఉంది. ప్రొఫెషనల్ క్రికెట్లో కూడా సామికి ఇంతవరకూ వివాదాస్పద చరిత్రేమీ లేదు. ఎవరితోనూ గొడవలు పెట్టుకున్న దాఖలాల్లేవు. అలాంటి సామి ఒక్కసారిగా తనపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారని పెట్టిన ట్వీట్.. పెద్ద దుమారమే లేపింది. వివాదం పెద్దదౌతోందని గ్రహించిన సామి.. మళ్లీ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టేలా ట్వీట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: