దేశంలో ఒక్కొక్కరిక ఒక్కో బుద్ది ఉంటుంది.. తమకు నచ్చిన పనులు చేస్తుంటారు.. ఎవరు చెప్పినా వినరు.  సాధారణంగా  దేవుళ్లను వారి విగ్రహాలను పూజిస్తుంటారు.    జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెంది బుస్సా కృష్ణ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీరాభిమాని. ట్రంప్ టెంపుల్ కట్టి.. ఆయన ఆరడుగుల ఎత్తయిన విగ్రహం పెట్టి మరీ పూజలు చేస్తున్నాడు.  ఇతగాడికి ట్రంప్ మీదున్న భక్తి కారణంగా ట్రంప్ కృష్ణ అని ఊళ్లో వాళ్లు పిలుస్తున్నారు. అతడి ఇంటిని ట్రంప్ హౌస్‌ అని కూడా పిలుస్తున్నారు. ఇతడికి ట్రంప్ అంటే ఎంత పిచ్చి అంటే.. చేతి వేలు కోసుకొని.. ఆ రక్తంతో ట్రంప్‌ ఫొటోకు బొట్టు పెట్టేవాడు.

IHG

ఇంతటి వీరాభిమాని ట్రంప్‌కి తన సొంత దేశంలోనైనా బహుశా ఉండకపోవచ్చు. తాజాగా ఇప్పుడు మరో వ్యక్తి ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న కరోనా ని బొమ్మను దేవతలా పూజిస్తున్నాడు.   కేరళలోని కడక్కల్‌కు చెందిన అనిలాన్‌ అనే వ్యక్తి.. కరోనా వైరస్‌ను దేవతగా ఆరాధిస్తున్నాడు. తన పూజగదిలో కరోనా వైరస్‌ను పోలిన ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి ప్రతి రోజు పూజలు చేస్తున్నాడు. ఈ దేశ ప్రజలను కరోనా నుంచి విముక్తి చెందించేలా చూడాలని ఆయన ప్రార్థిస్తున్నాడు.  అయితే అనిలాన్‌ ప్రయత్నంపై సోషల్‌ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి.

IHG

కరోనా దేవీకి పూజలు చేయడం ఏంటని? ఆయనను ఎగతాళి చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడని కొందరు అంటే.. ఇది పూర్తిగా మూఢనమ్మకమేనని మరికొందరు అంటున్నారు.   ఈ దేశ ప్రజలను కరోనా నుంచి విముక్తి చెందించేలా చూడాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడాలని కోరుకుంటున్నాడు. బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాల్లోని చాలా గ్రామాల ప్రజలు.. కరోనా దేవీకి పూజలు చేసిన సంగతి తెలిసిందే. అసోంలో మహిళలు కూడా కరోనా దేవీకి పూజలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: