అమెరికాలో మ‌రో   నల్లజాతీయుడ్ని పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘ‌ట‌న అట్లాంటా ప్రాంతంలో జ‌రిగింది. దీంతో ఆ దేశంలో నిరసనలు మరింత తీవ్రం కావడంతో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు. ఓ రెస్టారెంట్‌ పార్కింగ్‌ వద్ద ఓ వ్యక్తి కారులో నిద్రపోతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడంటూ శుక్రవారం రాత్రి అట్లాంటా పోలీసులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చేరుకున్నారు. కారులో ఉన్న 27 ఏండ్ల రేషార్డ్‌ బ్రూక్స్ పూటుగా మ‌ద్యం సేవించి ఉన్న‌ట్లు గ‌మ‌నించారు. ఈమేర‌కు నిర్ధార‌ణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేశారు. మ‌ద్యం సేవించికున్న‌ట్లుగా నిర్ధారించుకున్నాక అత‌డిని అరెస్ట చేసేందుకు య‌త్నించారు. 


ఈక్ర‌మంలోనే పోలీసుల‌కు నిందితుడికి మ‌ధ్య తోపులాట‌..పెనుగులాట జ‌రిగాయి. ఇంతలో ఓ పోలీస్‌కు చెందిన గన్‌ను బ్రూక్స్ లాక్కొని పరుగులు పెట్టాడు.  ఆగిపోవాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించినా బ్రూక్స్ విన‌లేదు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే బ్రూక్స్‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డం జ‌రిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డిన బ్రూక్స్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయాడని, ఈ ఘటనలో ఒక అధికారి గాయపడినట్లు  జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. బ్రూక్స్ మరణానికి బాధ్య‌త వ‌హిస్తూ అట్లాంటా పోలీస్‌ చీఫ్‌ ఎరికా షీల్డ్స్‌ తన పదవికి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. బ్రూక్స్‌పై కాల్పులు జ‌రిపిన  పోలీస్‌ అధికారిని విధుల నుంచి తొలగించారు. 

 

బ్రూక్స్‌ను కావాల‌నే పోలీసులు కాల్చి చంపార‌ని ఆరోపిస్తూ ఆందోళనకారులు శనివారం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. బ్రూక్స్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ప్రాంతంలోని రెస్టారెంట్‌తోపాటు కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. అయితే నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు మ‌రో ప్రాంతానికి విస్త‌రించ‌కుండా పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే ఇలా వ‌రుస‌గా న‌ల్ల‌జాతీయుల‌ను పోలీసులు చంప‌డం ఏంట‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఆందోళ‌న‌కారుల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.ఇప్పటికే జార్జి ఫ్లాయిడ్ మృతిపై యూఎస్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. పోలీసుల కాల్పుల్లో మరొకరు చనిపోయిన ఘటన ప్రజల ఆందోళనలను మరింత ఉదృతం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: