ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ కీలక నేతల అరెస్టులు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. వరుసగా పార్టీకి చెందిన సీనియర్ నేతలను  వివిధ ఆరోపణలపై అరెస్టు చేయడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే కావాలనే జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అక్రమ కేసులు బనాయించి టీడీపీ నేతల అక్రమ అరెస్టులు చేయించిందని టిడిపి గత మూడు రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు వైసీపీ నేతలను అరెస్టు చేసినప్పుడు సక్రమ అరెస్టులు అయినప్పుడు ఇప్పుడు టిడిపి నేతల అరెస్టులు అక్రమ అరెస్టులు ఎలా అవుతాయి అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. 

 


 150కోట్ల ఈఎస్ఐ స్కాం జరిగింది.. బోగస్ కంపెనీలు కు అనుమతి ఇచ్చారు. మరోపక్క దొంగ బస్సులు నడిపి.. పూర్తి దొంగ వ్యవహారాన్ని నడిపించారు. ఇలాంటి ఆరోపణలతో  ప్రస్తుతం జగన్ సర్కార్ అరెస్టు చేసింది. మరి ఇది నిజమా కాదా వాళ్ళు దోషుల నిర్దోషులా  అనే విషయం న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. కానీ వీరి అరెస్టు జరిగిందో లేదో వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనే విషయాన్ని సొంత పార్టీ నేతలు చెప్పేస్తున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

 


 ఒకప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నేర చరిత్ర కలిగిన వాడు అని ప్రస్తుతం ఆరోపిస్తున్న టిడిపి.. ప్రస్తుతం అలాంటి నేర చరిత్ర కలిగిన టిడిపి నాయకులను మాత్రం మంచి వాళ్ళు అని ఎలా అంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. అటు జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించి వ్యవహారం  అయిన ఇటు టిడిపి నేతలకు సంబంధించిన వ్యవహారం అయినా  కోర్టులు తెలుస్తాయి. అలా కాకుండా ఎవరికి వారు మంచి వారు అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి అవసరమా అని అంటున్నారు  విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: