ఈ మద్య మనుషులు కృర జంతువుల కన్నా దారుణంగా తయారవుతున్నారు.  డబ్బు కోసం ఎంత నీచానికైనా తెగిస్తున్నారు.. పేగు బంధాలను కాల రాస్తున్నారు.  దేశంలో కరోనా మహమ్మారి వల్ల కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎవరికి ఎవరూ ఐన వారు కాకున్నా ఎంతో మంది తమ ఆత్మీయత, మంచితనం చాటుకున్నారు.  పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్స్ కి కోట్ల విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.   తాజాగా పెన్షన్ డబ్బుల కోసం ఇద్దరు మహిళలు పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. మండుటెండలో మంచాన పడిన తన తల్లిని పెన్షన్ డబ్బుల తీసుకోవడం కోసం మంచంతో సహా లాక్కొచ్చింది. రూ. 1500 కోసం తన ఇంటి నుంచి బ్యాంకు వరకు ఈడ్చుకెళ్లింది.

 


 ఆ మద్య తనకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తన నాయినమ్మను చంపాడు ఓ మనవడు.. తన తల్లిని సాకలేని పరిస్థితిలో ఉన్నాని సజీవంగానే తల్లిని తగలబెట్టాడు ఓ కొడుకు.. కరోనా భయంతో తన తల్లిని నడి విధిలో ఉంచారు కొడుకులు.. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. మనుషులు మానవత్వం మరిచి రాక్షసులుగా మారిపోతున్నారు. అయితే ఒడిశా ఘటన అధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు ఇక నుంచి ఆ వృద్ధులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని అధికారులను ఆదేశించారు.

 


బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే 120 ఏళ్ల వృద్ధురాలు తన గూతురు గుంజాదేవితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో రూ. 1500రూపాయల పించన్ తీసుకురమ్మని 75 ఏళ్ల కూతురు గుంజాదేవిని బ్యాంకుకు పంపించింది.  అధికారులు మనిషి ఉంటేనే ఇస్తామని వెనక్కి పంపించేశారు. చేసేదేమి లేక తన తల్లిని మంచంపైనే పడుకోబెట్టి  బ్యాంకు వరకు లాక్కెళ్లింది. ఆమెను చూసి వెంటనే పెన్షన్ ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎండలో ఆ వృద్దురాలిని అలా తీసుకు వెళ్లడం.. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: