దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతుందని.. మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు ఎవరూ ఏ పని చేయకుండా కేవలం నిత్యావసర సరుకులకు మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.  కొంత మంది కంపెనీ యజమానులు వర్క్ ఫ్రమ్ హోం అన్నారు.  ఇలా కోట్ల మంది ఉపాది లేక నానా ఇబ్బందులు పడ్డారు. చిరుద్యోగులు చేయడానికి ఉద్యోగాలు లేక డబ్బులు లేక నరక యతన అనుభవించారు.  ఈ సమయంలో ప్రభుత్వాలు మూడు నెలలు ఇంటి అద్దె చెల్లించనవసరం లేదని.. మూడు నెలల తర్వాత కొద్ది కొద్దిగా ఆ డబ్బు వసూళ్లు చేసుకోవాలని యజమానులకు సూచింది. ఇది అతిక్రమిస్తే కేసులు అవుతాయని హెచ్చరించింది.  

 

అద్దె ఇంట్లో ఉండే వ్యక్తులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కొంత మంది ఇంటి యజమానులు అద్దె కోసం హింసించారు..వెల్లగొట్టారు.. ఇలా ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.  అద్దె ఇంట్లో ఉండే వ్యక్తులపై యజమానులు ఒత్తిడి తీసుకురావొద్దని, అద్దెను మూడు నెలల తరువాత  అడగాలని చెప్పింది.  కానీ, కొంతమంది ఇంటి యజమానులు మాత్రం అద్దెను బలవంతంగా వసూలు చేస్తున్నారు.  కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చికోడి పట్టణంలో శ్రీమంత్ దీక్షిత్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు.  

 

అయితే లాకా డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అద్దె కట్టలేదు.  దీంతో యజమాని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు.  అద్దెకట్టకుంటే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని అన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మద్య మాటా మాటా పెరిగిపోవడంతో పెద్ద గొడవే జరిగింది. ఇంట్లోకి వెళ్లిన ఓనర్ తుపాకీ తెచ్చి గాల్లోకి కాల్పులు జరిపాడు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓపిక నశించి వెంటనే తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పాడు. ఉద్యోగం లేకపోవడంతో తన వద్ద డబ్బులు లేవని ఇలాంటి సమయంలో దాను ఎలా అద్దె కడతానని దీక్షిత్ ప్రశ్నిస్తున్నాడు. ఇది కాస్త పోలీస్ కేసు వరకు వెళ్లడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: