ప్రస్తుతం భారత్ పై కరోనా  వైరస్ పంజా విసురుతున్న  విషయం తెలిసిందే. సంపూర్ణ లాక్ డౌన్  కొనసాగినన్ని రోజులు ఎంతో కంట్రోల్ లో ఉన్న కరోనా  వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం మూడున్నర లక్షలకు  చేరువలో ఉంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు ఇవ్వటం మొదలు పెట్టిన నుంచి.. పర్యవసానం కనిపిస్తూ వస్తోంది. ఇక ప్రతిరోజూ భారత్లో ఏకంగా పది వేలకు పైగా కొత్త కరోనా  కేసులు నమోదు అవుతుండటం..  వందల్లో  మరణాలు కూడా సంభవిస్తుడటం  భయాందోళనలు కలిగిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతోంది అనేదానిపై ప్రస్తుతం దేశ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. 

 

 ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా  వైరస్ పరిస్థితులపై అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ  అధ్యయనం చేపట్టగా భారత్లో కరోనా వైరస్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు ఈ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్యం జూలై 15 నాటికి కరోనా  వైరస్ తీవ్రత మరింత గా పెరిగిపోతుందని... ఏకంగా భారత్ లో ఎనిమిది లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయి అంటూ పేర్కొన్నారు పరిశోధకులు. బ్రెజిల్ తర్వాత స్థానంలో భారత్ చేరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. 

 


 అయితే 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో.. లాక్ డౌన్  సడలింపులు ఇస్తున్న కారణంగా... ప్రస్తుతం కరోనా వైరస్ మరింత శరవేగంగా విజృంభిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు పరిశోధకులు. భారత్లో ఇప్పటికే మహమ్మారి వైరస్ విజృంభణ భారీ రేంజ్ లో ఉంది. భారత్లో ఈ మహమ్మారి వైరస్ విజృంభణ పీక్ స్టేజికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటూ పరిశోధకులు చెప్పుకొచ్చారు. అయితే  ప్రపంచ వ్యాప్తంగా అమెరికా దేశం లో 21 లక్షల కరోనా  కేసులు అగ్రస్థానంలో ఉండగా... 8 లక్షల కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. భారత్ కరోనా వ్యాప్తి లో  ప్రపంచంలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: