ఏంటి అని షాక్ అవుతున్నారా? నిజంగానే ఓ మనిషి ఐదు నెలల్లో 100 కేజీలు పెరిగాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. సాధారణంగా ఈ లాక్ డౌన్ లో ఒక్క కేజీ పెరిగితేనే బాబోయ్ ఇంత లావు అయిపోయాం ఏలా ? అని అనుకుంటాం. అలాంటి ఆ మనిషి ఏకంగా 100 కేజీలు పెరిగాడు. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉహాన్‌కు చెందిన జహౌ అనే 29 ఏళ్ల యువకుడు ఓ కేఫ్‌లో పనిచేసేవాడు. అయితే ఎప్పుడు పని ఉండటం వల్ల ఏలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. ఎంతో ఉత్సాహంగా జీవనం సాగించాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఊహించని మలుపు ఈ లాక్ డౌన్. దాదాపు ఐదు నెలలు కొనసాగిన ఈ లాక్ డౌన్ లో ఓ యువకుడు ఊహించని రీతిలో దారుణంగా బరువు పెరిగిపోయాడు. దీంతో లేవలేని స్థితికి చేరుకున్నాడు. 

 

IHG

 

అయితే లాక్ డౌన్ కు ముందు బొద్దుగా క్యూట్ గా సుమారు వంద కిలోల బరువు ఉన్న యువకుడు గత ఐదు నెలల్లో మరో 100 కిలోలకు పైగా పెరిగిపోయాడు. లాక్ డౌన్ పూర్తి అయినా సరే అతను ఇంటి నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బరువు వల్ల నిద్రకూడా లేదు. అతను ఏకంగా 48 గంటలు నిద్ర లేకుండా గడిపాడట. 

 

 

దీంతో భయాందోళనకు గురైన జహౌ.. సాయం కోసం ఎమర్జన్సీ సేవలను ఆశ్రయించాడు. మెడికల్ టీమ్ ఎంతో కష్టపడి హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతడి బరువు 280 కిలోలు ఉంది అని వైద్యులు తెలిపారు. జహౌ ప్రస్తుతం ఉహాన్ యూనివర్శిటీలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇంకొద్ది రోజులు అతను అలాగే ఉంటే అనారోగ్య సమస్యలతో మరణించేవాడు అని పరీక్షలు చేసిన వైద్యులు చెప్తున్నారు. అందుకే ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉన్నప్పటికీ వ్యాయామాలు చేసి బరువు తగ్గండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: