రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఆదరణ కలిగిన జిల్లా అనంతపురం జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు అనంతపురం జిల్లా వాసులు. విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల సమయంలో కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రత్యర్ధి వైయస్ జగన్ ని ఢీ కొనాలంటే ఈ జిల్లాలో జేసీ బ్రదర్స్ కరెక్ట్ అని 2014 ఎన్నికల సమయంలో తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈ పరిణామంతో ఎప్పటినుండో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం గా ఉన్న క్యాడర్ లో ఆవేదన స్టార్ట్ అయింది.

 

ఎప్పటి నుండో పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని ప్రాణాలు పణంగా పెట్టి పార్టీకి అండగా నిలబడిన వారు జెసి బ్రదర్స్ రావటంతో ఒక్కసారిగా పార్టీని పెద్దగా పాటించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సమయంలో జేసీ బ్రదర్స్ కి చంద్రబాబు బాగా ప్రయారిటీ ఇవ్వటం దీంతో మిగతా కేడర్ లో నిరుత్సాహం నెలకొంది. దీంతో 2019 ఎన్నికలలో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. ఇటువంటి తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ అనంత పర్యటన వెళ్లినా గాని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కనబడిన అనంతలో మాత్రం పెద్దగా స్పందన రాలేదు.

 

ఈ పరిణామంతో అయినా పార్టీకోసం ఎప్పటినుండో పని చేస్తున్న వారికి సరైన స్థానం కల్పించాలని...దెబ్బతో చంద్రబాబు కి అర్ధమైపోయి ఉండాలే .. అవ్వలేదా ? అనే చర్చ అనంత తెలుగుదేశం పార్టీలో నెలకొంది. ఎంత ప్రత్యర్థిని అయినా ఢీ కొట్టాలని భావించిన సొంత వారిని పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు అనంతలో పక్కన పెట్టడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: