సాధారణంగా కొన్ని చెట్ల నుంచి ద్రవ పదార్థాలు వస్తుంటాయి.. ముఖ్యంగా తాటి చెట్టు, ఈత చెట్టు, కొన్ని సార్లు వేప చెట్టు ఇలా కొన్ని చెట్ల నుంచి వచ్చే వాటిని కల్లు అని వాడుక భాషలో అంటారు.  అయితే దక్షిణాఫ్రికాలోని కొన్ని అరణ్యాల్లో చెట్లకు నీరు కారడం అప్పడప్పుడు జియోగ్రాఫిక్ ఛానల్ లో చూపిస్తుంటారు. ఇలా ప్రకృతిలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి. ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంతో అది ప్రపంచంలోని ప్రకృతిలో ఏం జరుగుతుందో అన్న విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఆ మద్య  వర్థన్నపేట మండలం ఇల్లందలోని హనుమాన్ ఆలయంలో భారీ రావి వృక్షాన్ని గుర్తుతెలియని వ్యక్తి నరికి వేశాడు.

 

ఆలయంలోని రావిచెట్టును నరకడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రావిచెట్టు నుంచి నీరు కారుతోంది. అంతే అక్కడి భక్తులు ఆ  చెట్టు కన్నీరు పెడుతోందని... అదంతా దేవుడి మహిమేనని స్థానికులు భావించారు. ఈ తరహా కొన్ని సంఘటనలు జరిగాయి. ప్రకృతిలో  మనకు తెలియని ఎన్నో రహస్యాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. మనం ఈత చెట్లకు గాటు పెడితే ఈత, తాటి కల్లు ఉట్టిలోకి కారుతుంది. వేప చెట్టుకు కూడా అలా ఉట్టి కడితే వేప కల్లు వచ్చే విసయం తెలిసిందే. అయితే తమిళనాడులోని ఒక చెట్టును కత్తితో నరికితే నీళ్లు ధారలా చిమ్ముతున్నాయి.

 

  ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి దిగ్విజయ్ సింగ్ ఖాటీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ చెట్టును కత్తితో నరకగానే నీళ్లు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇది ఎందుకు వస్తుందో అన్న విషయంపై నిపుణులు చెప్పాల్సి ఉంటుందని.. కానీ ఈ వింత మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని వారు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: