ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి లో కరోనా వైరస్ భయమే కనిపిస్తోంది. శర  వేగంగా వ్యాప్తి చెందుతున్న  మహమ్మారి వైరస్ అందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. ఇక లాక్ డౌన్  అమలతో ప్రస్తుతం ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం అవుతూన్నాయి. ఈ అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు.ఈ  క్రమంలోనే  కొంతమంది ఫిట్నెస్ పై  దృష్టి  పెడితే ఇంకా కొంతమంది మాత్రం తినడం మీదే అంతకంటే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలా లాక్ డౌట్ రావటమే ఇక్కడొక  యువకున్ని  హాస్పిటల్ పాలు  చేసింది. 

 


వైరస్  మూల కేంద్రమైన ఊహన్ నగరానికి చెందిన జహౌ  అనే 29 ఏళ్ల యువకుడు ఒక కేఫ్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఇక పనిలో బిజీగా ఉండడంతో  కాస్త లావు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలకు దూరంగా నే ఉన్నాడు. అయితే అప్పటికే 100 కిలోల బరువు ఉండే వాడు యువకుడు. ఆ తర్వాత మొట్టమొదటిగా  వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఊహన్ లో  లాక్ డౌన్ అమలైన  విషయం తెలిసిందే. దీంతో అప్పటికే  100 కిలోలు ఉన్న ఆ యువకుడు లో తినడం మీద మరింత దృష్టి పెట్టాడు. దీంతో మరో  100 కిలోల బరువు పెరిగాడు. ఇంకేముంది భారీ కాయంతో ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడిందని ఆ యువకునికి. 

 

 దీంతో ఎంతగానో ఆందోళనకు గురైన యువకుడు 48 గంటల పాటు నిద్ర కూడా పోలేదు. ఎటు  కదల్లేకపోవడంతో సహాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసి తనకు సహాయం కావాలంటూ కోరాడు.  దీంతో అతని ఇంటికి చేరుకున్న మెడికల్ సిబ్బంది భారీగా బరువు ఉన్న అతని భారీ కాయాన్ని హాస్పిటల్ కు తరలించడానికి ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. అయితే అతని బరువు హాస్పిటల్ లో చెక్ చేసిన తర్వాత వైద్యులు షాక్ అయ్యారు. ఇతని రిపోర్టులు పరిశీలించి మరింత షాక్  అయ్యారు కొన్ని రోజులు ఇలాగే ఉంటే శ్వాస  సమస్యలు వచ్చి  గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉండేడని  అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఐసీయూ లో  చికిత్స పొందుతున్నారు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: