గత కొన్ని రోజుల నుంచి చైనా భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి లు నెలకొన్న విషయం తెలిసిందే.ఏదో విధంగా చైనా భారత సైనికులను రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా చైనాకు చెందిన బలగాలు  అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి రాళ్లతో అతి దారుణంగా దాడి చేసి ఏకంగా 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే చైనా దుశ్చర్య పై దేశం మొత్తం రగిలిపోతుంది. చైనాకు సరైన బుద్ధి చెప్పాలి అంటూ దేశ ప్రజానీకం మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే వీరమరణం చెందిన  జవాన్లకు  ఎంతమంది నివాళులు అర్పిస్తున్నారు. 

 


 దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డాక్టర్ మధు పై వేటు పడింది. భారతీయులందరూ చైనాతో పోరాడి వీర మరణం చెందిన 20 మంది జవాన్లు గురించి ఎంతగానో గొప్పగా చెబుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ ఉంటే... డాక్టర్ మధు మాత్రం 20 మంది భారత జవాన్లు వీర మరణాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 

 


 ఇక ఈ పోస్ట్ కాస్త  సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇక దీనిపై నెటిజన్లు అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు కూడా చేశారు. దీంతో అటు వెంటనే ఆ పోస్ట్ ను తొలగించారు డాక్టర్ మధు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో ఆ పోస్టు ఎంతో మందికి చేరుకుంది. దీంతో భారీ మూల్యం చెల్లించక తప్పలేదు డాక్టర్ మధు.  భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతూ ఒక పోస్టు పెట్టిన డాక్టర్ మధు వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయనను  సిఎస్కె అధికారికంగా సస్పెండ్  చేస్తున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: