విభజన తర్వాత మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ ఖచ్చితంగా జరగాలని సీఎం జగన్ మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరపైకి తీసుకురావడం అందరం చూశాం. అమరావతి లోనే కాక విశాఖపట్టణం మరియు కర్నూల్ ప్రాంతాలలో వైయస్ జగన్ రాజధాని విస్తరించాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానులు అన్నారో అప్పటి నుండి అమరావతిలో నవ్యాంధ్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. మొదటిలో ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా వర్గాలలో రాజకీయ పార్టీలలో వైరల్ పెద్ద హాట్ టాపిక్ గా వైరల్ న్యూస్ గా మారింది.

IHG

కరోనా వైరస్ రాకముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు, ఆందోళనలు చుట్టూ తిరిగాయి. కరోనా వైరస్ పుణ్యమా పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో రాజకీయాలు కూడా వేరే వైపు మళ్లడంతో… అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు ఆందోళనలు ఎవరూ పట్టించుకోని విధంగా మారిపోయాయి. అసలు రాజధాని రైతులు చేస్తున్న దీక్ష ప్రభావం ఆ ప్రాంతానికి తప్ప మిగతా చోట్ల ఎక్కడ కనపడటం లేదు.

IHG

మొదటిలో దీక్ష ప్రాంతాలకు వివిధ పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. మీడియా కూడా మంచి కవరేజ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తే అమరావతి రైతులు దీక్షలు, ఆందోళనలు చేస్తున్నా బయట ప్రపంచానికి అది పెద్దగా తెలియటం లేదు. ఆ విషయాన్ని మీడియా కూడా చాలా లైట్ గా తీసుకుంది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతి రైతు ఒక్కడిగా మిగిలిపోయారు అని పరిశీలకుల మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: