తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు. ఈ లేఖ‌లో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసేలా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. తెలుగుదేశం నేతల పై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ  లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే అందుకు పోలీసు శాఖ స‌హ‌క‌రించ‌డం త‌గ‌ద‌ని అన్నారు. కొంత‌మంది అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అస్స‌లు బాగోలేద‌ని, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని లేఖ‌లో ఆరోపించారు.  వైకాపా నేతలు తమ ప్రతీకారేచ్ఛకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధిపొందుతున్నారని అన్నారు.

 


 పోలీస్ బాస్ గా పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ లను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే నియంత రాజకీయాలకు చికిత్స అని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు అంబేద్కర్ మాటలకు అద్ధం పడుతున్నాయ‌ని పేర్కొన్నారు.ఇలాంటి నియంత రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తారని ఆశిస్తున్నా, బలహీన వర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయి, అయ్యన్నపాత్రుడు పై నమోదు చేసిన కేసులు కుట్రలో భాగమేన‌ని అన్నారు.వైద్యులు  సుధాకర్,  అనితారాణిల ఘటన లో పోలీసుల తీరు ప్రజలంతా చూసారు, అచ్చెన్నాయుడును చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు.

 


 అధికార వైఎస్సార్ సీపీ ని టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా నేతలను టార్గెట్ చేసే తీరు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అన్నారు. అయ్యన్న పాత్రుడు ప్రజాసేవలో నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నారు.  తన ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేని నాయకుడి పై తప్పుడు కేసు పెట్టారంటూ లేఖ‌లో వివ‌రించారు. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం వేడెక్కుతోంది. మండ‌లిలో కూడా బుధ‌వారం జ‌రిగిన ప‌రిణామాలు ఏపీ రాజ‌కీయాల్లో నెల‌కొన్న వేడిని తెలియ‌జేస్తున్నాయి. టీడీపీ నేత‌ల అరెస్టులు ఒక వైపు కొన‌సాగుతుండ‌గా..మ‌రోవైపు ఆ పార్టీ నుంచి వైసీపీ బాట ప‌డుతున్న వారి సంఖ్య కూడా అలాగే ఉంది. చూడాలి ఇంకా ఏం జ‌ర‌గ‌బోతోందో..?!

మరింత సమాచారం తెలుసుకోండి: