పైకి శాంతించే కాకమ్మ కథలు చెబుతూనే సరిహద్దుల్లో అశాంతి సృష్టించడానికి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. తన హద్దులు దాటి భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చు కోచి 45 ఏళ్ల ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి సరిహద్దులలో సమస్య సృష్టించడానికి చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘటనలో 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. చర్చలతో సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించుకుందాం అని మైకులు  ముందు మాట్లాడిన చైనా… సరిహద్దుల్లో మాత్రం తన వక్రబుద్ధి బయట పెట్టింది. జరిగిన ఘటనలో భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా దాదాపు 40 మంది వరకు మరణించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుత పరిస్థితులు బట్టి కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను ఆయుధ సామాగ్రిని చైనా మరియు భారత సరిహద్దుల వద్ద సమకూర్చుకుంటుంది.

 

దాదాపు యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టే అని అంతర్జాతీయ స్థాయిలో భారత చైనా సరిహద్దు వివాదాలు విషయంలో వార్తలు వస్తున్నాయి. అయితే యుద్ధం కనుక జరిగితే మాత్రం  భారత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది అంతర్జాతీయస్థాయిలో ప్రశ్నార్థకంగా మారింది. అయితే యుద్ధం జరిగితే మాత్రం ఎక్కువగా విజయావకాశాలు భారత్ గా ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో టాక్ నడుస్తోంది. రక్షణ వ్యయానికి భారత్ కంటే చైనా ఎక్కువగా ఖర్చుపెట్టిన గాని భారత్ చేతిలో ఉన్న అగ్ని 5 క్షిపణి చైనా క్యాపిటల్ బీజింగ్ మొత్తాన్ని తుడిచిపెట్టే గల సత్తా ఉందని… దీంతో చైనా చాలావరకు భారత్ తో గొడవ పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతే కాకుండా అప్పట్లో భారత్ అగ్ని 5 క్షిపణి కావాలని మా దేశాన్ని టార్గెట్ చేసి తయారు చేసిందని చైనా అంతర్జాతీయ వేదికలపై లబోదిబో మంది. అణ్వాయుధాల పరంగా గాని సాయుధ దళాలు, సబ్ మెరైన్ లు, ప్రధాన యుద్ధనౌకలు, ప్రధాన యుద్ద ట్యాంకులు, ఫైటర్ జెట్స్ వంటి విషయాలలో చైనాతో చాలా వరకు సమానంగా ఇండియా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చైనాతో యుద్ధం జరిగితే కనుక ఇండియా గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. మరోపక్క కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి కారణం చైనా అని చాలా దేశాలు బలంగా నమ్ముతున్న తరుణంలో ఇదే సమయం చైనాతో భారత్ తో యుద్ధం చేస్తే చాలా దేశాలు భారత్ కి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం యుద్ధం జరిగితే మాత్రం ఇండియాకి బెనిఫిట్ అని చాలామంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: