మామూలుగా అయితే సమాజంలో అమ్మాయి అబ్బాయి అనే వివక్ష ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటిది కాదు తరతరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు ఆడపిల్ల అంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేది. ఆడపిల్లకు ఎంతో సహనం ఓర్పు ఆలోచించే గుణం వుంది అని పిల్లలను సాకటానికి  ఆమెకు తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాదని భావించి అప్పట్లో వంటింటికే పరిమితం చేశారు ఆడపిల్లని. బయటికి వెళ్లి పని చేసి కుటుంబాన్ని పోషించే దేహదారుఢ్యం అబ్బాయికి ఉందని కుటుంబ పోషణ అప్పట్లో అబ్బాయిలకు అప్పగించారు. తర్వాత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా హక్కులకోసం పోరాటాలు చేయడం క్రమక్రమంగా వారికి హక్కులు రావడం లాంటివి కూడా జరిగింది. 

 


 ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులు అనే తేడా మాత్రం ఎక్కడా కనిపించదు. ప్రస్తుతం ఎక్కడో ఓ చోట తప్పా.. పూర్తిగా సమాజం తీరు మారిపోయింది. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నారు. విద్యలో  అయినా ఉద్యోగంలో అయిన వ్యాపారంలో అయినా ప్రతిరంగంలోనూ పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. దీంతో మహిళలు తమ హక్కులను సాధించుకున్నట్లే అయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ తల్లి చెప్పిన మాటలు నేటి సమాజంలో మహిళలు కాదు  పురుషులు వివక్షకు గురవుతున్నారు  అనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి అని అంటున్నారు విశ్లేషకులు. 

 

 తల్లి హోమ్ వర్క్  చేసుకుంటున్న తన కొడుకు దగ్గర ఆడ పిల్లల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు గురించి మాట్లాడుతుంటే... ఇక చాలు ఆపమ్మ...  ప్రస్తుతం వివక్షకు గురవుతోంది మహిళలు  కాదు పురుషులు... క్లాస్ లో ఒక అమ్మాయి డౌట్ అడిగితే ఎంతో స్వీట్ గా పిలిచి డౌట్ చెబుతారు.. అదే  అబ్బాయిలకు అయితే క్లాస్ డిస్టర్బ్ చేయకు అని కూర్చుంటారు.. అమ్మాయిలు హోంవర్క్ చేయకపోయినా  ఏమనరు అదే అబ్బాయిలు అయితే పనిష్మెంట్ ఇస్తారు అంటూ తన కొడుకు వ్యాఖ్యానించడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్  ఆలోచింపజేస్తుంది.నిజంగానే  ఇలాగనే జరుగుతుందని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను అంత ఆడపిల్ల  మగపిల్లాడు అని తేడాలేకుండా ఇద్దరికీ సమానంగా చూస్తే వివక్ష మరింత పెరిగి పోకుండా ఉంటుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: