మొత్తం మీద కధ క్లైమాక్స్ కి వస్తున్నట్లుగా సీన్ కనిపిస్తోంది. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ఇప్పటిదాకా అధికారులతో  సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఇంకా జరుపుతూనే ఉన్నారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలని వేడి వేడి ఆలోచనలు చాలానే చేస్తున్నారు.

 

ఇక అఖిలపక్షం ఇందులో చివరిది. అఖిలపక్షంలో అందరూ దాదాపుగా కేంద్రం తీసుకునే అభిప్రాయానికి, నిర్ణయానికి కట్టుబడిఉంటామనే చెబుతారు. అయితే వామపక్షాలు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తాయి అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే చైనాలో ఉన్నది వామపక్ష ప్రభుత్వం. వామ‌పక్షాలు మొదటి నుంచి చైనా పట్ల కొంత సానుకూలంగా ఉంటారని అంటారు. నెహ్రూ కాలంలో బలంగా ఉన్న వామ‌పక్షాల కారణంగానే ఆయన నాడు చైనా వైపు మొగ్గు చూపారని అంటారు.

 

ఇదిలా ఉండగా ఎవరు ఏమనుకున్నా చైనాకు గట్టిగా  బుధ్ధి చెప్పాలన్నది దేశంలో దాదాపు ప్రజలందరి  అభిప్రాయం. దేశం మూడ్ ఎలా ఉందో దాన్ని చూసి మోడీ సర్కార్ ముందుకు వెళ్తుంది. అలా కనుక ఆలోచన చేస్తే మోడీ సర్కార్ దూకుడుగానే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. 

 

అయితే అది కూడా అంత ఈజీ కాదు, చైనాతో యుధ్ధం అంటే చాలా లెక్కలు ఉంటాయి. వాటిని కూడా సరిచూసుకోవాలి. యుధ్ధం కంటే ముందు చాలా విషయాల్లో చైనాకు ముకుతాడు వేయాలి. చైనాతో మనకున్న వాణిజ్యాన్ని కటాఫ్ అనగలగాలి. అలాగే చైనాని దారికి తెచ్చే మార్గాలు వేరేగా ఏమైనా ఉంటే వెతకాలి.

 

అయితే చైనా జీ 7 దేశాలనే ధిక్కరించింది. హాంకాంగ్ అధికారాలను కాలరాస్తున్న చైనా మీద జీ 7 దేశాలు సరి చూసుకోమని చెబితే ఇది మా అంతర్గత వ్యవహార‌మని తెగేసి చెప్పిన తెగువ చైనాది. అందువల్ల చైనా యుధ్ధం వరకూ కధ తెస్తేనే తప్ప లొంగదు. అదే కనుక జరిగితే మూడవ ప్రపంచ యుధ్ధానికే దారితీస్తుంది.

 

ఎందుకంటే ఓ వైపు జీ 7 దేశాలు చైనా అంటే గుర్రుగా ఉన్నాయి. ఇంకో వైపు కరోనా వైరస్ అంటించింది అన్న అక్కసు, కోపంతో చాలా దేశాలే ఉన్నాయి. ఇవన్నీ కలిస్తె  చైనాకు అనుకూల దేశాలు అటు వైపు చేరితే కచ్చితంగా మూడవ ప్రపంచ యుధ్ధమే జరగడం ఖాయం. చూడాలి మరి 

మరింత సమాచారం తెలుసుకోండి: