గత కొన్ని రోజుల నుంచి చైనా భారత్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న ఏకంగా చైనా దళాలు అక్రమంగా భారత సరిహద్దు లోకి చొరబడి భారత సైనికుల పై దాడి చేయడంతో ఏకంగా 21 మంది సైనికులు వీర మరణం పొందారు, ఇదే సమయంలో అటు చైనా సైనికులు కూడా కొంత మంది చనిపోయారు. అయితే దీనిపై  దేశం మొత్తం రగిలిపోతున్న విషయం తెలిసిందే . అయితే ఏకంగా 20 మంది సైనికులు చనిపోవడం పై కామ్రేడ్లు తాజాగా సరికొత్త వాదన వినిపిస్తున్నారు. మోడీ కావాలనే  చైనాతో సంప్రదింపులు జరిపి ఇలా చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు కామ్రేడ్లు. 

 


 అయితే అసలు విషయం ఏమిటి అంటే... చైనాది కబ్జా చేసే ధోరణియా  లేదా భారత్ ది  కబ్జా చేసే ధోరణా అనేది  ప్రస్తుతం ఎంతో మందికి ఒక అయోమయంగా ఉంది. అయితే చైనా చుట్టుపక్కల సరిహద్దుల్లో  14 దేశాలు అయినప్పటికీ ఇప్పటివరకు చైనా వివాదాలు పెట్టుకున్న దేశాలు మాత్రం 21. అయితే ప్రస్తుతం చైనా చుట్టూరా 14 దేశాలు ఉన్నప్పటికీ ఒక్క పాకిస్తాన్తో మినహా మిగతా అన్ని దేశాలతో చైనా కి గొడవలు ఉన్నాయి . ఇక అటు సముద్రం అవతల ఉన్న ఎన్నో దేశాలతో కూడా పంచాయితీ పెట్టుకుంది  చైనా. 

 

 ఇదంతా చూస్తుంటే అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది చైనానే కబ్జా ధోరణితో ఉంది అని. అలాంటిది కామ్రేడ్లు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు పేదల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడి లాఠీ దెబ్బలు తిని జైలు శిక్ష అనుభవించిన కామ్రేడ్ల వారసులు... ఎంత గొప్ప సిద్ధాంతం నుంచి వచ్చిన వారు ప్రస్తుతం దేశానికి వ్యతిరేకంగా చైనా కు అనుకూలంగా  స్టేట్మెంట్ లు  ఇవ్వడం సరైనది కాదు అని అంటున్నారు. ఇప్పటికైనా తమ ధోరణి మార్చుకొని భారతదేశానికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి మద్దతు పలకాలని కోరుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: