మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎక్కడైనా పాము కనిపించింది అంటే... ఒక్కసారిగా వణికిపోతాము.. కుదిరితే అక్కడి నుంచి పరుగులు తీస్తాం.. అయితే పాములకు నీళ్లు పెట్టే వారిని ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా... చూసే ఉంటారు ఎందుకంటే ఇప్పటివరకు పాములకు నీళ్లు పెడుతూన్న  వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.  అయితే ఇప్పటివరకు నీళ్లు పెట్టిన వాళ్ళు ఏ బాటిల్ తోనూ లేదా ఏదైనా పాత్ర తోనో నీళ్లు పెట్టారు అది కూడా ఎంతో  దూరం ఉంది. కానీ పాము అతి దగ్గరగా వెళ్లి అరచేతిలో నీళ్లు పోసుకుని పాముకు  ఎప్పుడైనా నీళ్లు పెట్టడం చూశారా... 

 


 అరచేతిలో నీళ్ళు పెడితే పాము ఎలా తగ్గుతుంది..? అయిన అలా అరచేతులో  నీళ్లు పెట్టడానికి ధైర్యం ఉండాలి కదా అని అంటారా..?  అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఒక వ్యక్తి అరచేతిలో నీళ్లు పోసుకుంటే పాము వచ్చి ఆ నీళ్లు తాగుతున్న ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో  చక్కర్లు కొడుతుంది. ఈ అరుదైన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంతనంద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారిపోయింది. 

 


 వీడియోలో  మొదట అరచేతిలో  ఉన్న నీటిని నాలుకతో తాగాలి అనుకుంటుంది పాము కానీ అది కుదరకపోవడంతో రెండు తొడల పై కొంచెం ప్రతికూల ఒత్తిడిని కలిగించి నీటిని తీసుకుంటుంది. ఆ వెంటనే మళ్లీ నోటిని మూసి వేసి  సానుకూల పరిస్థితికి వచ్చి  నీటిని శరీరంలోకి పంపుతుంది అంటూ తెలుపుతూ ఫారెస్ట్ అధికారి నందా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక పాము అర చేతిలో ఉన్న నీటిని తాగుతూ గుటకలు వేస్తున్న  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఒకసారి చూసారు ఉంటే ఆశ్చర్యపోక మానరు.

మరింత సమాచారం తెలుసుకోండి: