చైనా కరోనా వైరస్ కంటే భయంకరమైనది. చైనా తన చుట్టు పక్కల చిన్న దేశాలను మింగేయడం, పెద్ద దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం చేస్తూ ప్రపంచ భూదందాకోరుగా మారిపోయింది. ఎంత చిత్రం అంటే సముద్రాన్ని కూడా దురాక్రమించిన చరిత్ర ఒక్క చైనాకే ఉంది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ గొడవలు, తగవులు చైనాకు ఎపుడూ ఉంటూనే ఉన్నాయి.

 

ఇపుడు చైనా కన్ను అర్జంటుగా  గ్వాలాన్ లోయ మీద పడింది. అందుకే అక్కడ కొన్ని నెలలుగా టార్గెట్ చేసి మరీ పక్కా ప్లాన్ తో భారతీయ జవాన్లను పొట్టనపెట్టుకుంది. 1962 నాటి యుద్ధంలో ఆక్సిన్ చైనాను ఆక్రమించిన చైనా టిబెట్ ని గుటుక్కున మింగేసింది. ఇపుడు గ్వాలాన్ లోయను ఆక్రమించుకోవడం ద్వారా భారత్ లో భాగంగా ఉన్న లడక్ ప్రాంతాన్ని మింగేయాలని చైనా చూస్తోందిట.

 

ఇక అంతే కాదు, అరుణాచలప్రదేశ్ మీద కూడా చైనా కన్ను పడిందట.  ఎప్పటికైనా చైనా అరుణాచల ప్రదేశ్ ని కలిపేసుకుందామనుకుంటోంది. ఇక అదే విధంగా నేపాల్ ని, ఇటు భూటాన్ ని కూడా మింగేస్తే టోటల్ గా ఒక పని అయిపోతుందని అతి పెద్ద దుర్మార్గమైన ప్లాన్ తో చైనా దూకుడుగా  దూసుకువస్తోంది.

 

ఇవన్నీ లాగేసిన తరువాత నేరుగా ఇండియాతోనే యుధ్ధం పెట్టుకుని ఒక్కోటీ మెల్లగా దగ్గరలోని ప్రాంతాలను లాగేసుకోవడం సుదీర్ఘకాలం ఎత్తుగడగా ఉంది. అంటే గత పదేళ్లలో భారత్  చైనాని చూసీ చూడకుండా వదిలేయడం వల్ల ఇపుడు ఏకు మేకులా మారిందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే చైనాను ఇపుడే ఇక్కడే కట్టడి చేయలి. మరెన్నడూ ఈ వైపుగా చూసేందుకు సాహసించకుండా గట్టిగానే గుణపాఠం చెప్పాలి. లేకపోతే భారత్ ని అస్థిరపరచే చర్యలకు చైనా తెగబడుతుంది. భారత్ కి శాశ్వతంగా ముప్పు తెస్తుంది.  అందుకే తొక్క తీయాల్సిందే. నక్క జిత్తుల తోక కట్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: