ప్రస్తుతం అందరిలో కరోనా  భయమే ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ దాడి చేస్తోందని కొందరు బెంబేలెత్తిపోతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు అయితే కరోనా లక్షణాలు ఉంటే పేషెంట్ను ముట్టుకోవడం కూడా లేదు అని చెప్పాలి. లేదా భారీ మొత్తంలో ఫీజులు చెల్లించిన తర్వాతనే పేషెంట్ ని హాస్పిటల్ లోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కరోనా  సంక్షోభంలో ఎంతగానో క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఈ కరోనా  సంక్షోభం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. 

 


 ఇక్కడ ఒక మహిళకు జరిగిన సంఘటన  మాత్రం సభ్య సమాజానికి ఎన్నో మెసేజ్ లు  ఇస్తుంది. మామూలుగా అయితే కరోనా లక్షణాలతో  వెళ్లగానే టెస్ట్ చేసిన తర్వాత చికిత్స చేసేలాగా  ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో అయితే మరింత భయాందోళనకు గురవుతున్నారు. రోహిత అనే మహిళ భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఆమె శ్వాస తీసుకోవడానికి ఎంతగానో ఇబ్బంది పడింది. దీంతో ఆమెను సన్ షైన్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ కరోనా పేషెంట్ ను తీసుకోవడం లేదు అంటూ చెప్పడంతో ఏకంగా పది కార్పొరేట్ ఆసుపత్రులకు తిప్పారు.. 

 


 కానీ ఏ హాస్పిటల్ కు తిప్పిన ఎవరు చేర్చుకొము  అన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రెండు లక్షలు కడితేనే చేర్చుకుంటామంటూ డిమాండ్ చేశారు. ఇక అన్ని కార్పొరేట్ ఆసుపత్రులను తిప్పి చివరికి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ ఆ మహిళ చనిపోయింది. అయితే కరోనా  వైరస్ కష్టకాలంలో ఆసుపత్రులు  ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగా టమాడుతున్న ఆస్పత్రుల్లో పై దృష్టి పెడితే బాగుంటుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: