పాకిస్తాన్ భారతదేశంపై  ఎప్పుడు దాడి చేయాలా అని  అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు వివాదం పై దృష్టి పెట్టి చైనాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్లోకి భారీ మొత్తంలో పంపేందుకు పాకిస్థాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాతో భారత్కు వివాదాన్ని ప్రస్తుతం అవకాశంగా మార్చుకోవాలని అనుకుంటుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో అటు భారత ఆర్మీ అధికారులు కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొని మట్టుబెడుతున్నారు, దాదాపు మూడు నెలల నుంచి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన భారత ఆర్మీ

 


 తాజాగా నిన్న ఇవాళ కలిపి ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అయితే ఎప్పుడో ఒకసారి ఇలా ఉగ్రవాదుల హతం జరిగితే కొత్తగా అనిపిస్తుంది కానీ గత మూడు రోజుల నుంచి వరుసగా ఉగ్రవాదుల హతం జరుగుతుండడంతో దేశంలో ఉగ్రవాదులు హతం గురించి అంతగా వార్తలు కూడా రావడం లేదు. అయితే ఈసారి భారత్ లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులు ఏం చేసారంటే  మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికి నాటకం ఆడారు. 

 

 పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు సైనికదళాల పై కాల్పులు జరిపి మసీదులోకి  వెళ్లి దాక్కోన్నారు. ఈ నేపథ్యంలో భారత దళాలు మసీదు లోపలికి వెళ్తే మైనారిటీలపై దాడులు చేస్తున్నారు అంటూ అక్కడున్న వారందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలి అనుకున్నారు  ఉగ్రవాదులు . కానీ భారత సైన్యం మాత్రం  ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మసీదు చుట్టు పూర్తిగా మొహరించి ఆ తర్వాత.. మసీదులో కి కొన్ని రసాయనాలను పంపించడం ద్వారా చచ్చినట్లు వారి బయటకు రావడంతో కాల్చి చంపారు సైనికులు. ఇలా  ఒక వైపు సైన్యం చైనా ఎత్తులను చిత్తు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్ కూడా తిప్పి కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: