మద్య తరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కష్టపడి ఒక్కో పైసా కూడబెడుతూ.. వాటితో తమకు కావాల్సినవి సమకూర్చుకుంటారు. అలాంటి డబ్బు ఎవరిచేతిలో పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. కానీ అలాంటి వారిని కొంత మంది సైబర్ మోసగాలు దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో చూశాం.  ఒక్క వంద రూపాయలు మనం పోగొట్టుకుంటే ఆ రోజంతా ఎంత బాధపడతామో అందరికీ తెలిసిందే.  అలాంటిది రూ. వారికి రూ. 66,700 రూపాయాలు ఓ సంస్థను నమ్మి డిపాజిట్ చేశాడు.. తర్వాత ఆ కంపెనీ పత్త లేకుండా పోవడంతో కృంగిపోయాడు. దొంగల పాలైన సొమ్ము తిరిగి రావడం అంటే అసాధారణమే. కేసు పెట్టి రోజులు గడిచినా కూడా చాలా వరకు  ఫలితం ఉండదు.  

 

సైబర్ నేరగాళ్లు చాలా పకడ్భందీగా డబ్బులు లాగేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా పోరాడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకోగలిగాడు. ఆరు సంవత్సరాల తర్వాత ఎలాగోలా అతనికి డబ్బును పోలీసులు తిరిగి ఇచ్చేశారు. ఇక పోయిందన్న బాధతో ఉన్న అతగాడికి డబ్బు తిరిగి రావడంతో ఆనందం పట్టలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆయుర్వేద వైద్యుడిగా పని చేసే మీరా సాహెబ్ 2014లో ఓ పత్రికలో రుణాల మంజూరుపై వచ్చిన ప్రకటన చూసి వారిని సంప్రధించాడు. తనకు కావాల్సిన లోన్ కోసం వారికి రూ. 66,700 జమచేశాడు.

 

 కొన్ని రోజుల తర్వాత తాను సంప్రదించిన కంపెనీ పత్తా లేకుండా పోయింది. తాను మోసపోయానని గుర్తించి రిజర్వు బ్యాంక్ అధికారులకు లేఖ రాశాడు. అయినా కూడా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2018 డిసెంబరు 8న కంకిపాడు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపిన పోలీసులు నగదు జమ ఖాతా వివరాలు సేకరించి బ్యాంకు అధికారులతో ఆ ఖాతాలో ఉన్న రూ.60,400 సొమ్మును నిలుపుదల చేయించారు. ఆ మొత్తాన్ని డీడీ రూపంలో బాధితుడికి అందించారు. ఆరేళ్ల తర్వాత తాను పోగొట్టుకున్న సొమ్ము తిరిగి ఇవ్వడంతో పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: