ప్రపంచ దేశాల సరసన భారత్ ను నిలబెట్టిన ఓ మొనగాడా .. తిప్పరా మీసం. ఆ చైనా వాడికంటే మనం ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతున్న ఓ మొనగాడా తిప్పరా మీసం అంటూ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి యూత్ అంతా పొగిడేస్తున్నారు. భారత్ దేశమంతా ఇప్పుడు మోదీ మీసకట్టు గురించి మాట్లాడుతోంది. భారత్ ను ప్రతి దశలోనూ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ధీటుగా ఎదుర్కుంటామంటూ, తమతో పెట్టుకుంటే ఆషామాషీగా ఉండదు అనే సంకేతాలను ఇస్తున్న భారత్ ను ముందుకు నడిపిస్తూ, ప్రపంచదేశాల సరసన నిలబెడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేక స్టైల్ ఉంది. ఆయన ప్రతిదశలోనూ వైవిధ్యం చూపిస్తుంటారు. వస్త్ర ధారణ దగ్గర నుంచి ప్రతిదీ విభిన్నంగా చేయడం, మోదీ స్టైల్. ఇప్పుడు ప్రధాని మోదీ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

 

IHG


అందరికంటే భిన్నంగా అన్ని విషయాల్లోనూ ఉండడం మోదీ స్టైల్.ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఓవర్ కోట్ లో బాగా పాపులర్ అయ్యారు. భారతీయ ఫ్యాషన్ ట్రెండ్ ను ఆయన ఎంతగా ప్రభావితం చేసాడో అర్థం చేసుకోవచ్చు. మోదీ వస్త్రాలంకరణ, వాటి ఖరీదు వంటి విషయాల్లో అందరికీ ఆసక్తి ఉంది. ఇదే విషయమై ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటాయి. తెల్లటి జుట్టు, తెల్ల గడ్డం తో మోదీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించే విధానం ఆయనకు మాత్రమే సొంతం. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు మోదీ అనేకసార్లు ప్రజల ముందుకు వచ్చారు. తన సందేశాన్ని వినిపించారు. 

 

కోట్లాది మంది ఆయన సందేశం కోసం ఎదురు చూపులు చూశారు. ఆ సమయంలో మోదీ మెడ చుట్టూ కండువా చుట్టుకుని ప్రత్యేకంగా కనిపించారు. మళ్లీ రెండు రోజుల క్రితం జరిగిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలోనూ, అలాగే చైనా కవ్వింపు చర్యల వ్యవహారంలోనూ, దేశంలోని విపక్షాలతో జరిగిన సమావేశంలో మోదీ సరికొత్త రీతిగా కనిపించారు. గడ్డం, మీసం గతం కంటే బాగా పెంచారు. చైనాపై మీసం మెలి వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పేందుకే మోదీ ఈ తరహా లో కనిపిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ త్వరలోనే మెలివేసి మరీ చైనాక గట్టి దెబ్బ తీస్తారని సోషల్ మీడియాలో నెటిజన్లు మోదీ సరికొత్త వేషధారణ పై అదేపనిగా పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: