ఈ మద్య ఘరానా దొంగలు సోషల్ నెట్ వర్క్ బాగా వాడుతున్నారు.  టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్లు బాగా తయారయ్యారు.. తాజాగా  వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌ చేసి 100 మంది బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది.  అమాయకంగా ఉన్న అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లు చేశారు.  వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌ చేసి వారి డిటేల్స్ తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు.  బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తార్‌ఖాన్‌, మనీశ్‌, పూజా స్నేహితులు. 

 

టెక్నాలజీని వారి అవసరాలకు బాగా ఉపయోగించుకున్నారు.  సత్తార్‌ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. నకిలీ ఆధార్‌కార్డులతో సిమ్‌ కార్డ్స్‌ను సమకూర్చేవాడు. సత్తార్‌ఖాన్‌ సహాయంతో మనీశ్‌, పూజా ఈ నకిలీ నెంబర్ల నుంచి సదరు బాలికలకు కాల్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు గురిచేసి డబ్బులు దండుకున్నారు. వారి నుంచి సమాచారం తీసుకుని తమ మాట వినని అమ్మాయిలను మీ సమాచం సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తామని బెదిరించేవారు. చెప్పిన బ్యాంక్‌ అకౌంట్లలో నగదు జమచేయకపోతే వ్యక్తిగత సమాచారాన్నంతా బయట పెడతామని బెదిరించేవారు. 

 

నిందితుల్లో ఒకరు ఇటీవలే 12వ తరగతి పాస్‌ అయ్యాడు. ఇలా వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌ చేసి పల్వాల్‌, ఫరిదాబాద్‌, గురుగ్రామ్‌, ఢిల్లీలో 100 మందికి పైగా బాలికలను బ్లాక్‌మెయిల్‌కు గురిచేసి డబ్బులు వసూలు చేశారన్నారు.  గత కొన్ని రోజులగా వీరి టార్ర్ భరించలేక ఓ బాధిత అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరిదాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కొంతమంది స్కూలు, కాలేజీ విద్యార్థులతో స్నేహం ఏర్పరుచుకొని ఎలాగోలా వారి నుంచి బాలికల ఫోన్‌ నంబర్లు తీసుకునేవారని పోలీసులు తెలిపారు.  ఎవరికీ ఏ వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: