ఒక్కపుడు పుల్వామా మరియు ఇప్పుడు లడక్ ప్రాంతాల వద్ద భారత్ ఆర్మీ పై శత్రుదేశాల సైనికులు చేసిన దాడుల విషయములో ప్రధాని మోడీ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో పాకిస్తాన్ దేశం పుల్వామా చెక్ పాయింట్ వద్ద భారత్ ఆర్మీ జవాన్లను దొంగ దెబ్బ తీయడం జరిగింది. ఘటనలో చాలా మంది భారత సైనికులు చనిపోవటం మనకందరికీ తెలిసిందే. భారత సైనికుల శవాల ముందు గంభీరం ప్రదర్శిస్తూ మోడీ ఆ టైంలో దీనికి కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేసి మోడీ భారత్ యొక్క శక్తి ఏంటో శత్రుదేశం పాకిస్థాన్ కి తో పాటు ప్రపంచానికి తెలియజేశారు. కానీ ఇటీవల చైనా సరిహద్దు ప్రాంతం లడక్ వద్ద 20 మంది భారత సైనికులను చైనా సైనికులు కర్రలతో రాళ్లతో మరియు ఇనుపరాడ్లతో చంపిన సమయంలో మోడీ స్పందించిన తీరు చాలా విభిన్నంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

 

కారణం చూస్తే చైనా సరిహద్దుల్లో జరిగిన ఘటనలో అమరులైన భారత సైనికులను ఉద్దేశించి  నివాళులర్పిస్తూ నరేంద్ర మోడీ మీ త్యాగం వృధా కాదు అని అన్నాడు కానీ ఇందుకు ప్రతీకార చర్యలు ఉంటుందని మాత్రం ఎక్కడ చెప్పనే లేదు. దానికి దీనికి ఏమిటి తేడా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కారణం చూస్తే పుల్వామా ఘటన జరిగిన టైంలో ఎన్నికలు రావటంతో వెంటనే ఏమీ ఆలోచించకుండా మోడీ తదుపరి కార్యాచరణ చేశారు. మరి ఇప్పుడు చైనా సైనికుల విషయంలో ఎన్నికలు లేకపోవటమే అని భావిస్తున్నారు. ఎన్నికల వచ్చిన టైములోనే మోడీ శత్రువుల కు చెక్ పెడతారు… దేశ ప్రజల మన్ననలను పొందుతారు చాలామంది చర్చించుకుంటున్నారు. దీంతో చైనా సరిహద్దుల్లో ఘటనలో చనిపోయిన 20 మంది సైనికుల ప్రాణాలకు పూర్తి బాధ్యత మోడీదే అని చాలామంది అంటున్నారు.

 

ఇటీవల మోడీ ఈ ఘటన గురించి మాట్లాడుతూ చైనా సైనికులు తమ సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించిననేలేదని అన్నారు. మరోపక్క  భారత భూభాగానికి సంబంధించి అంగుళం కూడా వదులుకోమని అఖిలపక్ష సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇక్కడ మోడీ తీరు చూస్తుంటే భారత సైనికులు కావాలని గొడవ పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్నట్లు ఉంది. వాళ్లు మన భూభాగంలో వస్తేనే మన సైనికులు వారిపై తిరగబడే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో చైనా మన భూభాగంలోకి రాలేదు భారత సైనికులు చనిపోయారు అని కేంద్రం మాట్లాడటం బట్టి చూస్తే ఈ పూర్తి బాధ్యత మోడీదే.. వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణం కూడా ఆయనే అన్నట్టుగా దేశంలో చాలామంది చర్చలు జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: