చైనా దుశ్చ‌ర్య‌ల‌ను ఎదుర్కొనేందుకు భార‌త్ అన్ని విధాలుగా స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌ప‌డి ఉండేందుకు..నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ అధికారాలు ఇస్తూ ఆదివారం జ‌రిగిన త్రివిధ ద‌ళాధిపతుల స‌మావేశంలో నిర్ణయించారు. ఈ స‌మావేశంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని చైనా స‌రిహ‌ద్దులో శత్రు దేశం సైనిక బ‌ల‌గాల‌ను ఎలా ఎదుర్కొవాలో..ఎలా వ్య‌వ‌హ‌రించాలో దిశానిర్దేశం చేశారు. ఈ స‌మావేశంలో సైనిక వ్య‌వ‌స్త‌కు అవ‌స‌ర‌మైన  అలు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈనేప‌థ్యంలో భారత, చైనా మధ్య ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే త్రివిధ దళాల అవసరాల నిమిత్తమై కేంద్ర ప్రభుత్వం ఆదివారం 500 కోట్లను కేటాయించింది.

 

 అత్యంత విపత్కర పరిస్థితులు తలెత్తితే నూతన ఆయుధాలు కొనుగోలు, తదితర అవసరాల నిమిత్తమై దీనిని విడుదల చేసినట్లు అత్యున్నత వర్గాలు ప్రకటించాయి.  ‘‘త్రివిధ దళాలకూ అత్యవసర సమయంలో ఆయు కొనుగోలుకై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500 కోట్లను కేటాయించింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి నిమిత్తమై ఎలాంటి ఆయుధాన్నైనా కొనుగోలు చేసుకోవచ్చు.’  అని అధికారులు ప్రకటించారు. అయితే త్రివిధ దళాలు కూడా ఇప్పటికే తమకు అవసరమైన వాటి జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.  ఈ ప్రాజెక్టు కింద రక్షణ దళాలు సైనిక వ్యవహారాల శాఖతో సంప్రదించి, యుద్ధానికి అవసరమయ్యే, లేదా వారి జాబితాలో ఉండే ఆయుధాల కొనుగోళ్లు చేయవచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ వ్యాప్తికి ప్ర‌ధాన కార‌ణ‌మైన చైనాను ప్ర‌పంచ దేశాలు తూర్పార ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ దేశాల దృష్టి మ‌ళ్లించేందుకు భార‌త్‌పై యుద్ధ ప్ర‌యోగాల‌కు చైనా సిద్ధ‌మ‌వుతోంది. భార‌త్‌తో కావాల‌నే స‌రిహ‌ద్దు వ‌ద్ద యుద్ధ‌న్మోదంతో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఓ వైపు శాంతి ప్ర‌వ‌చ‌న‌లు వ‌ల్లిస్తూనే మ‌రో వైపు స‌రిహ‌ద్దుల వ‌ద్ద క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. చైనా వ‌స్తువులు ప్ర‌పంచ వ్యాప్తంగా తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్న వేళ‌..సూప‌ర్ ప‌వ‌ర్ అభివృద్ధికి బీట‌లు బారుతున్నాయి. ఆ అవ‌కాశం భార‌త్‌కు ద‌క్క‌కుండా చేయాల‌న్న‌దే చైనా అస‌లు వ్యూహం. తాను గెల‌క‌డంతో పాటు భార‌త్ మిత్ర దేశాల‌ను శ‌త్రు దేశాలుగా మార్చేందుకు వేగంగా కుట్ర‌లు ప‌న్నుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: