ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత భాగమైన గాల్వాన్ లోయను  ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నించినప్పటికీ భారత్ వెనుకడుగు వేయక పోవడంతో అది కాస్తా కుదరలేదు. కానీ చైనా కోరుకున్నది మాత్రం జరిగింది అనే వాదన మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం పి ఓ కే భారత్లో అంతర్భాగం చేసుకునేందుకు భారత సైన్యం పకడ్బందీగా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా కు సంబంధించిన వన్ రోడ్ వన్ బెల్ట్ అనేది వస్తున్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండే . ఒకవేళ అది పూర్తయితే చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది, 

 


 ఒకవేళ భారత్ కనుక పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను  భారత భూభాగంలో కలుపుకుంటే చైనా కి భారత్ లో అడుగు పెట్టె  అవకాశం ఉండదు దీంతో చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాస్త ఆగిపోతుంది. దీంతో వన్ రూట్ వన్ బెల్ట్ అంటూ చైనా చేపట్టిన పని కాస్త ఆగిపోతుంది. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ చైనా కి ఒక ఆఫర్ కూడా ఇచ్చింది. పీఓకే నీ  స్వాధీనం చేసుకోవడానికి సహకరిస్తే చైనా భారత్  కలిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేద్దాం అంటూ మోడీ సర్కార్ ఒక ప్రతిపాదన కూడా వినిపించింది. ఇలా చేయడం వల్ల అటు చైనా ఇటు భారత ఎంతో  అభివృద్ధి చెందుతుంది అంటూ తెలిపింది. 

 


 కానీ చైనా మాత్రం కేవలం తమ దేశం ఎదగాలి అనుకుంటుంది కానీ భారత్ ఎదగనివ్వకుండా ఆపాలని అనుకుంటుంది. తనతో పోటీదారు కాకుండా చూసుకోవాలని అనుకుంటుంది. అంటే ప్రస్తుతం మోడీ ఉన్నంతవరకు పీవోకే జోలికి వెళ్లకుండా చేస్తే ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకునీ భావించిన చైనా ప్రస్తుతం పీవోకే పై  భారత దృష్టిని మళ్ళించేందుకు... గాల్వన్ లో  దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించింది అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ చైనా ను తప్పు పడుతున్న విషయం తెలిసిందే.. అయితే పంచ దేశాల దృష్టిని మళ్ళించేందుకు ఇలా భారత్ తో  కయ్యానికి కాలు దువ్వుతుంది  అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా చైనా అనుకున్నది సాధ్యమైంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: