ఇటీవల చైనా భారత్ సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించిన  విషయం తెలిసిందే. చైనా దుశ్చర్యకు  ఒక్కసారిగా 20 మంది సైనికులు మరణించడంతో దేశం మొత్తం అట్టుడికి పోయింది. ప్రతీకారం తీర్చుకోవాలని అంటూ అందరూ రగిలిపోయారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలు అయినప్పటికీ వారిలో ఉన్న దేశ భక్తిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. చైనా వాళ్ళ పై ప్రతీకారం తీర్చుకోవడానికి బార్డర్ కి  బయలుదేరారు 11 ఏళ్ళ లోపు ఉన్న చిన్నారులు. ఇక వారు చెప్పిన సమాధానం చూసి ఏకంగా పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అలీగడ్ జిల్లాలో చోటు చేసుకుంది. 

 

 పదిమంది పిల్లలు బార్దర్  వైపుగా వస్తున్నారు. వారి వయసు కేవలం  7 నుంచి 11 ఏళ్ళ లోపే ఉంటుంది, పరిగెడుతూ వెళ్తున్న పిల్లలను పోలీసులు అడ్డుకున్నారు. ఇటువైపుగా ఎందుకు వెళ్తున్నారు ఇది బోర్డర్ ఏరియా అంటూ చెప్పగా..బార్డర్  ఏరియా అని తెలిసే వెళ్తున్నాము అంటే పిల్లలు సమాధానం ఇచ్చారు. ఎందుకు అని అడిగితే మన సైన్యాన్ని చంపారు  కదా మా తడాఖా ఏమిటో చూపిస్తాం ప్రతీకారం తీర్చుకుంటాం భారత్ మాతాకి జై అంటూ పిల్లలు నినాదాలు చేయడం ఆ పోలీసు అధికారులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. మీరు చిన్నపిల్లలు సైన్యంతో ఎలా పోరాటం చేస్తారు అని అడిగితే తప్పకుండా చేస్తామూ  అంటూ సమాధానం చెప్పారు ఆ పిల్లలు.  

 


 అంత చిన్న పిల్లల్లో  అంత గొప్పగా దేశభక్తిని చూసిన పోలీసులకు ముచ్చటేసింది. ఆ వీర సైనికుల మరణానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుందాం  మీరు ఇంటికి వెళ్లి చదువుకోండి అంటూ పోలీసులు వెనక్కి పంపారు, అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక పోలీసు అధికారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా... ఆ పిల్లలు చెప్పిన సమాధానంతో నెటిజన్లు  అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంత చిన్న పిల్లలు నిస్వార్ధమైన దేశభక్తి అందరు ఫిదా అయిపోతున్నారు.పిల్లలు ఇంకా ప్రపంచాన్ని కూడా సరిగ్గా చూడకముందే ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు.. కల్మషం లేని దేశభక్తితో ఉన్నారు అని అంటున్నారు నెటిజన్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: