కరోనా భయంతో అల్లాడుతున్న జనాలకి ఇప్పుడు యోగా గురువు బాబా రాందేవ్ ఒక చక్కటి శుభవార్తను చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్, ఔషధాల కోసం ఇప్పటికే పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ నివారణ కు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఔషధాన్ని తయారు చేసింది. కరోనిల్ పేరుతో తయారుచేసిన ఔషధం ను మంగళవారం హరిద్వార్ లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా  మాట్లాదారు. తమ సంస్థ తయారు చేసిన ఔషధం కొవిడ్-19 చికిత్సలో ఉపయోగపడుతుంది అని, పతాంజలి కార్యనిర్వహణాధికారి బాలకృష్ణ చెప్పారు. 


covid 19 కి కారణమయ్యే సార్స్, కోవి 2 వైరస్ కు తాము తయారుచేసిన దివ్య కరోనిల్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు. అశ్వగంధ గిలోయ్ , తులసితో కలిపి దీనిని తయారు చేశామని, కరోనా బాధితుల చికిత్సలో వినియోగించినప్పుడు వంద శాతం మంది కోరుకున్నట్లుగా బాబా రాందేవ్ తెలిపారు. పతాంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జైపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఈ మందులను తీసుకొచ్చామని ఆయన చెప్పారు.


 మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. కరోనా తో అల్లాడుతున్న ప్రపంచానికి ఈ మందు తీసుకురావడం సంతోషంగా ఉందని, బాబా రాందేవ్ పేర్కొన్నారు. హరిద్వార్లోని దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రస్తుతం ఈ మందు ఉత్పత్తిని ప్రారంభించాయని తెలిపారు. అందరికంటే ముందుగా ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసి విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కరోనా మందును తయారు చేసేందుకు దాదాపు  155 ఔషధ మొక్కలు వాడినట్లుగా పతాంజలి సంస్థ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: