ప్రస్తుతం చైనా భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు పరిస్థితులు మరింత హాట్ హాట్ గా మారిపోతున్నాయి సరిహద్దుల్లో. ఇక మొన్నటికి మొన్న భారత్ చైనా సరిహద్దుల్లో ఏకంగా చైనా సైన్యం దాడి కి భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు మరణించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏకంగా 20 మంది సైనికులు మరణించడం భారతదేశంలోని ప్రతి ఒక్కరి రక్తం మరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా చైనా పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు, ఈ క్రమంలోనే బ్యాన్ చైనా అనే ఒక నినాదం తెరమీదికి వచ్చింది. 

 

 చైనా కు సంబంధించిన వస్తువులను ని బ్యాన్ చేయాలి అంటూ ఒక నినాదం తెరమీదకి రాగా  దీనికి సంబంధించి ఎన్నో విభిన్నమైన వాదాలు కూడా వినిపించాయి. అయితే దేశ ప్రజలు ఇలా చైనా వస్తువులను బ్యాన్  చేయడం కంటే కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువులని బ్యాంక్ చేస్తే  సరిపోతుంది కదా అనే వాదన కూడా తెరమీదికి వచ్చింది.. అయితే ఇప్పటికి చైనా కు సంబంధించిన రైల్వే కాంట్రాక్ట్  లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. హర్యానా కూడా తమ రాష్ట్రంలో చైనాతో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ క్యాన్సల్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది . ఇక మొన్నటికిమొన్న మహారాష్ట్ర కూడా సంచలన నిర్ణయం తీసుకుంది చైనా కాంట్రాక్టులను వెంటనే రద్దు చేసింది. 

 


ఇలా  ఒక్క రాష్ట్రం చైనా కు వరుసగా షాకుల ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలు చైనా కు సంబంధించిన అన్ని కాంట్రాక్టును రద్దు చేసుకుని చైనా కు భారీ షాక్ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో మరి ఏ రాష్ట్రాలు ఇలా చైనా కంపెనీలు కాంట్రాక్టు లను  బ్యాన్చేస్తూ  కీలక నిర్ణయం తీసుకుంటారో  అని అంటున్నారు విశ్లేషకులు. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు చైనా కి షాక్ ఇవ్వడం ద్వారా... చైనా వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏ రాష్ట్రాలు ఇలా చైనా కు సంబంధించిన కాంట్రాక్టు లను  కంపెనీలను రద్దు చేస్తాయి అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: