చైనా కి పాకిస్తాన్ కి మధ్య ఎంతో మంచి సంబంధం ఉన్న విషయం తెలిసిందే. చైనా చెప్పు చేతుల్లోనే పాకిస్తాన్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే చైనా ఆదేశించింది పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. ఇలా చైనాకు అతి సన్నిహితమైన మిత్ర దేశంగా పాకిస్తాన్ ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ దేశాలకు ఒకటే ఆలోచన అదే భారత్ ను నాశనం చేయడం. అందుకే ఈ రెండు దేశాలు పరస్పరం ఒకేదారిలో  కొనసాగుతూ వస్తున్నాయి. ఇక పాకిస్తాన్తో చైనా ఎన్నో పెట్టుబడులు కూడా పెడుతుంది.  ఇదిలా కొనసాగుతుంటే తాజాగా చైనా పాకిస్తాన్ ని మోసం చేసింది అనే ఒక వాదన తాజాగా తెరమీదకు వచ్చాయి. 

 

 పాకిస్తాన్ చైనా కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు సంబంధించి నిపుణులు చేసినటువంటి చర్చల్లో చైనా పాకిస్థాన్లలో పెట్టినటువంటి భారీ పెట్టుబడులు అతి పెద్ద బ్లండర్ అనేది బయటపడింది. అయితే ప్రస్తుతం చైనా పాకిస్థాన్లు కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లు..అన్ని  కడుతూ  ఉన్నప్పటికీ అక్కడి ప్రజలకు మాత్రం అంత మొత్తంలో ఖర్చు పెట్టే కెపాసిటీ లేదు అని అంటున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ అతి తక్కువ ఆర్థిక స్తోమత కలిగిన వారు ఉన్నారని.. అలాంటి వారు ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడరు అని అంటున్నారు విశ్లేషకులు. 

 


 అయితే ఆర్థిక నిపుణులు రక్షణ  నిపుణులు ఏమంటున్నారంటే ఇప్పుడు వరకు కొన్ని ఆర్థికంగా సరిగ్గా లేని దేశాలకు ఎలాగైతే అప్పులు ఇచ్చి ఆ తర్వాత ఆయా దేశాలు అప్పులు కట్ట  లేకపోవడంతో చైనా చెప్పుచేతల్లో ఎలాగైతే పెట్టుకుందో ప్రస్తుతం పాకిస్థాన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. భారీ మొత్తంలో  పాకిస్థాన్ చైనా ఇచ్చిన లోన్స్ తిరిగి చెల్లించలేదని తెలిసినప్పటికీ కూడా చైనా పాకిస్తాన్ కి లోన్స్ ఇచ్చిందని.. అలా పాక్  తిరిగి చెల్లించలేని క్రమంలో పాకిస్థాన్ ను పూర్తిగా  తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చైనా భావిస్తోంది అని చెబుతున్నారు విశ్లేషకులు. తద్వారా చైనా పాకిస్తాన్ ని పూర్తిగా వాడుకుంటుంది అని  పాకిస్తాన్ రక్షణ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: