భారతదేశంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు మృత్యువుతో పోరాడాల్సి  వస్తుంది. ఇంకా ఎంతో మంది ప్రజలు మృత్యువాత ఒడిలోకి చేరుతున్నారు. దాదాపుగా భారత దేశ వ్యాప్తంగా రోజు రోజుకు 14 వేలకు  పైగా కరోనా  వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో  దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. Ee క్రమంలో  దేశ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లోనే  బతుకును వెళ్లదీస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కరోనా  వైరస్ కు సంబంధించి భారత్లో శుభపరిణామం వచ్చిన విషయం తెలిసిందే. 

 

 ఇన్ని రోజుల వరకు ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ లేదు అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో భారత్ లో ఇప్పటికే రెండు మూడు కంపెనీలు కరోనా  వైరస్ కు విరుగుడు ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు కంపెనీలు విరుగుడు ప్రకటించగా అటు యోగా గురువు బాబా రాందేవ్ కూడా కరోనా  వైరస్ కు ఆయుర్వేద ఔషధాన్ని ప్రకటించారు, అయితే సిప్లా కంపెనీ నుంచి కరోనా  వైరస్ కు ఇంజెక్షన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ ను అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంచనున్నట్లు  తాజాగా వెల్లడించింది. 

 

 మరో వారం లేదా పది రోజుల్లో మార్కెట్లోకి రానున్న తమ కరోనా  ఇంజక్షన్ ధర  ప్రపంచంలోనే అతి తక్కువ అంటూ ఆ సంస్థ పేర్కొంది. ఇంజక్షన్ ధర 5 వేల కంటే తక్కువగానే ఉంటుంది అంటూ ప్రకటించింది, అయితే దేశ వ్యాప్తంగా ఈ డ్రగ్ ను విడుదల చేసేందుకు కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. వైరస్ ను నియంత్రించేందుకు రెమిడీసీవర్ అనే ఇంజక్షన్  తయారుచేసింది. కొన్ని రోజుల్లో ఈ మహమ్మారి వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం చర్యలు చేపడుతుంది. అయితే తెలంగాణకు చెందిన హెట్రో డ్రగ్స్ సంస్థ కూడా కరోనా  వైరస్కు వ్యాక్సిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ వాక్సిన్ ఈ విషయంలో కూడా ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: