ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ కరోనా  వైరస్ కారణంగా దివాళా తీసే పరిస్థితి కి వచ్చాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ మరింత పడిపోయింది. ఈ  కరోనా  వైరస్ కష్టకాలంలో కంపెనీలన్నీ  నష్టాల్లో కూరుకు పోతుంటే ఒక వ్యాపారి సంపద మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతోంది. 

 


 సీరమ్  తయారీ లో ప్రసిద్ధి చెందిన శసీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్  పూనవలా కరోనా  వైరస్ టైమ్ లో  ఎంతగానో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి  నుంచి మే చివరి నాటికి దిగ్గజ వ్యాపారవేత్తల సంస్థలపై కరోనా వైరస్ ప్రభావం ఎంతమేరకు ఉంది అన్న వివరాలతో కూడిన నివేదికను హరూన్  రీసెర్చ్ సంస్థ తాజాగా విడుదల చేశారు. ఈ నివేదికలో కేవలం కరోనా  వైరస్ వ్యాప్తి చెందిన ఈ నాలుగు నెలల కాలంలో అత్యంత వేగంగా వృద్ధి చెంది ఎక్కువ సంపద సాధించిన భారత బిలియనీర్ గా సైరస్  పూనావాలా   మొదటి స్థానంలో నిలవడం గమనర్హం . 

 


 ఇక ఆన్లైన్ దిగ్గజ సంస్థ అయినా అమెజాన్ అధినేత జెఫ్  జోసెఫ్ తన సంపదను కూడా అమాంతం పెంచుకున్నారు. కరోనా వైరస్ సమయంలో కూడా అమెజాన్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని పెంచుకుని... ప్రపంచంలోనే నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నారు అమెజాన్ అధినేత జెఫ్ జోసెఫ్. ఇక ఈ విషయంలో సైరస్  పూనావాల ప్రపంచంలోని 5వ స్థానంలో ఉన్నట్లు తాజాగా హరూన్ రీసెర్చ్ నివేదికలో వెల్లడయ్యింది. అయితే టీకా కంపెనీగా సీరమ్  ఇన్స్టిట్యూట్కు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండటం... బలమైన వ్యాపార సామర్థ్యం కలిగి ఉండడమే ఈ కంపెనీ సంపద పరుగులు పెట్టించేందుకే దోహదపడింది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: