వైసీపీ రఘురాముడు బాణాలు వేశారు. ఇపుడు రివర్స్ లో సర్రున దూసుకుని మరీ  బాణం వచ్చింది. రాముడిగా తానున్నానని తనకేమీ తెలియదని నర్సాపురం ఎంపీ రాజు గారు అపుడే మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. తాను జగన్ని ఏమీ ఒక్క మాట కూడ అనలేదని కూడా ఆయన అంటున్నారు. అయితే బొచ్చులో నాయకత్వం అని ఆయన అన్నట్లుగా విజయసాయిరెడ్డి ఆయనకు పంపించిన 18 పేజీల షోకాజ్ నోటీసులో ఉంది. అంతే కాదు ఆయన వివిధ సందర్భాల్లో జగన్ మీద ఇండైరెక్ట్ మీద వేసిన బాణాలు కూడా అందులో పొందుపరచారు. 

 

వీటిని ఆయన బదులివ్వడానికి వారం రోజులు టైం ఇచ్చారు. కానీ రఘురామక్రిష్ణంరాజు కేవలం ఒక్క రోజులోనే సమాధానం పంపుతానని అంటున్నారు. సరే ఇవన్నీ మామూలు లాంచనాలే. ఆయన్ని పార్టీ ఏం చేయదలచింది అన్నది ఇపుడు ప్రశ్న. నిజానికి చాలా కాలంగా ఆయన పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటున్నారని పార్టీ పెద్దలు అంటున్నారు.

 

ఇక జగన్ ఆయన విషయంలో ఏం చేస్తారు అన్నది కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన అంశంగా ఉంది. అయితే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, బహిష్కరణ చేయడం వంటి పెద్ద నిర్ణయాలు ఉంటాయా అంటే పార్టీలో కొందరి మాటలను బట్టి అలాంటివి ఉండవు అంటున్నారు. రఘురామక్రిష్ణంరాజు మీద అలా చేస్తే ఆయన జనం ద్రుష్టిలో హీరో అయిపోతారని అంటున్నారు.

 

పైగా ఆయన చాలా  ఫ్రీ బర్డ్ అవుతారని, ఆ హుషార్ లో ఆయన మరిన్ని ఆరోపణలు కూడా డైలీ గుప్పిస్తారని అంటున్నారు. మరో వైపు ఆయన నచ్చిన పార్టీలో కూడా చేరే వెసులుబాటు వస్తుందని అంటున్నారు. అయితే రఘురామ‌క్రిష్ణం రాజు విషయంలో చాలా వ్యూహాత్మకంగానే వైసెపీ డెసిషన్ ఉంటుందని అంటున్నారు. ఆయన కోరుకుంటున్న స్వేచ్చ ఇవ్వకుండా కట్టడి చేస్తారని అంటున్నారు. 

 

అంటే ఆయన మీద వైసీపీ ముద్ర చెరిపేయకుండా ఉంటూనే చేయాల్సింది చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఇంత రచ్చా చేసిన తరువాత కోరుకున్న రాజకీయ వరం రాక‌పోతే రాజు గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి రాజు గారు షోకాజ్ నోటీస్ తరువాత కూల్ గానే ఉన్నారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: