జగన్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో తమకు చోటు దక్కుతుందని కూడా భావిస్తున్నారు. భారీ ఎత్తున ఆశావహులు మంత్రి బెర్త్ కోసం లాబీయింగ్ చేస్తున్నారంటేనే సీన్ అర్ధమైపోతోంది. మంత్రి పదవి పైన మోజు అలాంటిది మరి. కానీ జగన్ మనసులో ఏముందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

 

జగన్ ఆలోచనలు తీసుకుంటే ఇద్దరితోనే కధ ముగిస్తారని ఒక చర్చ సాగుతోంది. అదే సమయంలో సరిగ్గా పనిచేయని మంత్రులకు తప్పకుండా ఉద్వాసన ఉంటుందని అంటున్నారు. అలాంటి వారి జాబితాను కూడా కొందరు ఆశావహులు సిధ్ధం చేసుకుని మరీ అక్కడ తమ పేర్లను అతికించేసుకుంటున్నారు.

 

నిజానికి జగన్ పెట్టిన కండిషన్ ప్రకారం రెండున్నరేళ్ల ప్రకారం మంత్రివర్గం విస్తరణ ఉండకూడదు, కానీ రాజ్యసభకు ఇద్దరు మంత్రులు ఎంపిక అయ్యారు. వారిద్దరూ  పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. ఈ ఇద్దరూ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకులు. దాంతో బీసీ వర్గాలాకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకుంటున్నారు.

 

అదే సమయంలో వారి సామాజికవర్గానికి చెందిన వారు కూడా మంత్రి సీటు కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఇద్దరితో ఇది ఆగదని, జగన్ మంత్రివర్గం విస్తరిస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే తమకు బెర్తులు దక్కుతాయని బయోడేటాతో సైతం ఆశావహులు చక్కర్లు కొడుతున్నారట.

 

 

మరి జగన్ ఎవరిని దీవిస్తారో, ఎవరి మీద దయ చూపిస్తారో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు, నిజానికి జగన్ లెక్కల్లో నలుగురైదుగురు మంత్రులు పనితీరు బాలేదని నివేదికలు ఉన్నాయట. ఆలా చూసుకుంటే వారితో కలుపుకుని అరడజన్ మంది ఇన్ అవుతారని అంటున్నారు. చూడాలి మరి.ఏం జరుగుతుందో.  ఏది ఏమైనా ఇపుడు సీనియర్ నేతల వద్ద మాత్రం ఆశావహులు క్యూకట్టి తమ మొర ఆలకించమంటున్నారుట.  ఒక్కసారి అయినా కుర్చీ ఎక్కించమంటున్నారుట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: