2019 ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీపీ( పొట్లూరి వరప్రసాద్) ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గాని వరుస భూవివాదాలు మరియు ఆర్థిక వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ తో  కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేసులో విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన పీవీపీ తాజాగా హైదరాబాద్ నగరంలో కైలాష్ విక్రమ్ అనే ఇంటి లోకి ప్రవేశించి దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

పీవీపీ ఇంటి పక్కనే కైలాశ్ విక్రమ్ ఇల్లు ఉన్న తరుణంలో ఇంటిని బాగు చేసుకుంటున్నా ఈ సమయంలో తన ఇంటిని కబ్జా చేయడానికి పీవీపీ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నారని ఇటీవల ఇల్లు మరమ్మతులు చేస్తుంటే ఇంటిలోకి తన అనుచరులతో వచ్చి బెదిరింపులు చేయడం జరిగిందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పీవీపీ తన ఇంటి దగ్గరికి వచ్చి బెదిరిస్తున్న వీడియో కూడా బయటపెట్టడంతో ఈ కేసు సంచలనం సృష్టించింది. వెంటనే పోలీసులు పీవీపీ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించుకొని ఆరా తీయడంతో పాటు విచారిస్తున్న తరుణంలో చాలామంది పీవీపీ బాధితులు బయటపడుతున్నారు.

 

తిమ్మారెడ్డి అనే వ్యక్తి గతంలో పీవీపీ తనని బెదిరించినట్లు మూడు రోజులు కిడ్నాప్ చేసి తన అనుచరులతో విజయవాడ తీసుకెళ్లి కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు అప్పట్లో చేయడం జరిగిందట. అయితే ఆ కేసు విషయంలో తనకి పీవీపీ  అనుచరుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణ హాని ఉందని మరోసారి తాజాగా మరోసారి తిమ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి తరుణంలో తన పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన పీవీపీ పై ఈ విధంగా ఆర్ధిక వివాదాలు, భూవివాదా గొడవలు వరుసగా వస్తున్న తరుణంలో పీవీపీ తో జగన్ ఓసారి మంతనాలు జరిపాలని రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల వల్ల పార్టీ ఇమేజ్ డామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో జగన్ పీవీపీ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: